డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా: రాయనిపేట గ్రామంలో గ్రామంలోని దర్గాను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన గాని పీకేపీ మిత్రులు.గురువారం మదనపురం కేంద్రానికి చెందిన రసూల్ నిర్వహించిన దర్గా కందులు వేడుకలో వారు పాల్గొన్నారు.చాలా సంవత్సరాల తర్వాత ఒకే వేదికపై సమావేశమైన వారు పూర్వ రోజుల్ని గుర్తు చేసుకుంటూ ఆప్యాయంగా మాట్లాడుకున్నారు.హాజరైన వారు పరస్పరం పలకరించుకుంటూ జ్ఞాపకాలను పంచుకున్నారు. అనంతరం అందరూ కలిసి ఫొటోలు దిగుతూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గాని పీకేపీ శ్రీధర్,బాలు, శివ,శ్రీను, రాము,అరుణ్, సాయి, శ్రీ హరి తదితరులు పాల్గొన్నారు.
News
దర్గాలో ప్రత్యేక పూజలు చేసిన గాని పీకేపీ మిత్రులు