డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల, గంభీరావుపేట: గంభీరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన పొక్సో కేసులో నిందితుడికి 4 సంవత్సరాల జైలు శిక్ష, రూ.2000 జరిమానా విధిస్తూ సిరిసిల్ల పొక్సో కోర్టు న్యాయమూర్తి రాధికా జైస్వాల్ శుక్రవారం తీర్పు వెలువరించారు.
నిందితుడు అగదండి రాజేందర్ పాఠశాల ప్రాంగణంలో గోడ దూకి బాలికలతో అసభ్యంగా ప్రవర్తించగా, ప్రిన్సిపాల్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి ఎస్ఐ మహేష్ దర్యాప్తు పూర్తి చేసి నిందితుడిని రిమాండ్ కు తరలించారు.
కోర్టు విచారణలో 10 మంది సాక్షులను ప్రవేశపెట్టగా, పబ్లిక్ ప్రాసిక్యూటర్ జాన్సీ వాదనలు వినిపించారు. ఆధారాలు పరిశీలించిన న్యాయమూర్తి నేరం రుజువైనట్లుగా శిక్ష ఖరారు చేశారు.
ఈ కేసులో కృషి చేసిన అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే అభినందించారు.