| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సిరిసిల్ల జిల్లా అథ్లెటిక్స్ లో సత్తా చాటిన మరిమడ్ల విద్యార్థి... జావలిన్ త్రోలో సిల్వర్, రాష్ట్రస్థాయికి సెలెక్ట్

సిరిసిల్ల జిల్లా అథ్లెటిక్స్ లో సత్తా చాటిన మరిమడ్ల విద్యార్థి... జావలిన్ త్రోలో సిల్వర్, రాష్ట్రస్థాయికి సెలెక్ట్

డైలీ భారత్, మరిమడ్ల / సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు జరిగిన జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలలో మరిమడ్ల జడ్పీహెచ్ఎస్ విద్యార్థి సత్తా చాటాడు.

అండర్-18 విభాగంలో నిర్వహించిన జావలిన్ త్రో పోటీలో మరిమడ్ల గ్రామానికి చెందిన జడ్పీహెచ్ఎస్ మరిమడ్ల పాఠశాల విద్యార్థి పి. శ్రీకాంత్ ద్వితీయ స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ సాధించాడు.

దీంతో శ్రీకాంత్ ఈ నెలలో హనుమకొండలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం జరిగింది. ఈ ఘనత పాఠశాలకే కాకుండా మరిమడ్ల గ్రామానికి ఎంతో గర్వకారణమని ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా విజేత శ్రీకాంత్ ను పాఠశాల ప్రధానోపాధ్యాయులు మోడెం శ్రీనివాస్ అభినందించారు. విద్యార్థికి సహకరించిన ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు పాఠశాల తరఫున, గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఇటువంటి అవకాశాలు చాలా అరుదుగా వస్తాయని, విద్యార్థులు క్రీడల్లో కూడా రాణించి ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు.

Previous రూ. 20 వేలు లంచం తీసుకుంటూ దొరికిపోయిన జీపీఓ...
Next ఢిల్లీ పేరు మారనుందా?
ADVERTISEMENT