| Daily భారత్
Logo




జిల్లా ఎస్పీ ని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన పోలీస్ అధికారుల సంఘం కార్యవర్గ సభ్యులు

News

Posted on 2026-08-19 14:45:25

Share: Share


జిల్లా ఎస్పీ ని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన పోలీస్ అధికారుల సంఘం కార్యవర్గ సభ్యులు

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల జిల్లా: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇటీవల ఎన్నికైన నూతన పోలీస్ అధికారుల సంఘం కార్యవర్గ సభ్యులు బుధవారం రోజున జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ మహేష్ బి. గితే ని  మర్యాదపూర్వకంగా కలుసుకుని మొక్కలను అందజేశారు.

ఈసందర్భంగా ఎన్నికల నోడల్ అధికారి స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ వెంకటేశ్వర్లు జిల్లా పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గ సభ్యులను జిల్లా ఎస్పీ కి  పరిచయం చేశారు.అధ్యక్షుడిగా గోపాల్ , ఉపాధ్యక్షులుగా  ఇన్స్పెక్టర్ రవి ,ఎస్.ఐ వెంకట్రాజం,  సెక్రటరీగా ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు, జాయింట్ సెక్రటరీ గా శ్రీనాథ్ రాజ్ ,ఆర్గనైజింగ్ సెక్రటరీగా ప్రకాష్ , ట్రెసరర్ గా  వేణు, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబెర్స్ గా గోపాల్, శ్రీనివాస్ సుధాకర్, పద్మ,మహేష్ ,తిరుపతి, కో అప్షన్ సబ్యులుగా రిజర్వ్ ఇన్స్పెక్టర్ మధుకర్, మహిళ కానిస్టేబుల్ ప్రియాంక ఉన్నారు.

అనంతరం ఎస్పీ మాట్లాడుతూ..నూతనంగా ఎన్నికైన రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ అధికారుల సంఘం కార్యవర్గ సభ్యులకు ముందుగా అభినందనలు తెలిపారు. పోలీస్ సిబ్బంది సమస్యలపై తక్షణమే స్పందించి, వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. పోలీస్ అధికారుల సంఘం సిబ్బందికి అండగా నిలుస్తూ, స్ఫూర్తిదాయకంగా పనిచేయాలని ఎస్పీ గారు  ఆకాంక్షించారు.

ఈకార్యక్రమంలో డిఎస్పీ వెంకటేశ్వర్లు,నూతన పోలీస్ అధికారుల సంఘం కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Image 1

డ్రగ్స్ రహిత జిల్లాగా రాజన్న సిరిసిల్ల:... అవగాహన కార్యక్రమాల్లో రాష్ట్రంలోనే సెకండ్

Posted On 2026-08-20 09:09:01

Readmore >
Image 1

17 ఏళ్ళ ప్రియుడితో తాతను హత్య చేయించిన 13 ఏళ్ళ మనవరాలు...

Posted On 2026-08-20 04:41:00

Readmore >
Image 1

విమర్శనాత్మక వార్తలపై జర్నలిస్టులపై క్రిమినల్‌ కేసులు సరికాదు...

Posted On 2026-08-20 04:28:21

Readmore >
Image 1

₹4 లక్షల నకిలీ ఆభరణాలతో ముత్తుట్ లో లోన్... ఖమ్మం లో ముఠా అరెస్ట్

Posted On 2026-08-19 16:17:15

Readmore >
Image 1

ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య కేసు... జల్సాల కోసమే పదో తరగతి విద్యార్థుల ఘాతుకం...

Posted On 2026-08-19 14:56:19

Readmore >
Image 1

జిల్లా ఎస్పీ ని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన పోలీస్ అధికారుల సంఘం కార్యవర్గ సభ్యులు

Posted On 2026-08-19 14:45:25

Readmore >
Image 1

అసలు నెయ్యి అనుకున్నారా? అదంతా కల్తీనే... హైదరాబాద్‌లో 36 టన్నుల నెయ్యి పట్టివేత

Posted On 2026-08-19 14:32:50

Readmore >
Image 1

రోబోటిక్ సర్జరీతో 2 రోజుల్లో నడక... కామారెడ్డి రైతుకు యశోద ఆసుపత్రిలో కొత్త జీవితం

Posted On 2026-08-19 13:31:53

Readmore >
Image 1

దారుణం... ఆస్తి కోసం భర్త, 4 ఏళ్ల కుమారుడిని చంపిన భార్య

Posted On 2026-08-19 10:28:48

Readmore >
Image 1

పిఠాపురం AE కుటుంబం గల్లంతు... అల్లుడి హత్య నుంచి కోడలి లేఖ వరకు సాదిక్ పాత్రపై పోలీసుల ఫోకస్

Posted On 2026-08-19 10:10:39

Readmore >