| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

అపెరల్ పార్కులో గార్మెంట్ కార్మికులను శ్రమ దోపిడీ చేస్తున్న యాజమాన్యం

అపెరల్ పార్కులో గార్మెంట్ కార్మికులను శ్రమ దోపిడీ చేస్తున్న యాజమాన్యం

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల :ఈరోజు బి.వై. నగర్ లోని సీఐటీయూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐటియు నాయకులు మూషం రమేష్ , కోడం రమణ గార్లు మాట్లాడుతూ గత రెండు సంవత్సరాల క్రితం సిరిసిల్ల పెద్దూరు శివారులో ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఆపెరల్ పార్కులో గోకుల్ దాస్ కంపెనీ వారు గ్రీన్ నీడిల్ గార్మెంట్ యూనిట్ ని ప్రారంభించడం జరిగిందన్నారు గ్రీన్ నీడిల్ గార్మెంట్ యూనిట్ లో పనిచేస్తున్న కార్మికులతో  యాజమాన్యం ఓవర్ డ్యూటీ చేపిస్తూ పని భారం మోపుతుందని షిప్ మెంట్  పేరుతో ఆదివారం రోజు కూడా సెలవు ఇవ్వకుండా పనిచేయిస్తూ కార్మిక చట్టం ప్రకారం OT ఓవర్ టైం కట్టివ్వడం లేదని కార్మికుల పట్ల అనుచితంగా మాట్లాడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని కంపెనీలో పనిచేస్తున్న కొంతమంది కార్మికులు మా సిఐటియు యూనియన్ దృష్టికి తీసుకురావడంతో సిఐటియు యూనియన్ గా గార్మెంట్ యూనిట్ ను సందర్శించి యూనిట్ అధికారులతో మాట్లాడడం జరిగిందన్నారు  కంపెనీ యాజమాన్యం చేస్తున్న శ్రమ దోపిడీని , కార్మిక హక్కులను ప్రశ్నిస్తున్న సిఐటియు సంఘ నాయకులపై యూనిట్ యాజమాన్యం పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేసి భయపెట్టాలని చూస్తున్నారన్నారు కార్మిక వర్గ సమస్యలపై నిరంతరం పోరాడుతూ కార్మిక హక్కుల సాధన కోసం పనిచేస్తున్న సంఘం సిఐటియు అని గార్మెంట్ యూనిట్ యాజమాన్యం కార్మికులను చేస్తున్న శ్రమదోపిడిపై యూనియన్ ఆధ్వర్యంలో డిసీఎల్ డిస్ట్రిక్ట్ లేబర్ కమిషనర్ ,  స్టేట్ లేబర్ కమిషనర్ గార్లకు ఫిర్యాదు చేస్తామని అపెరల్ పార్క్ లో పనిచేస్తున్న గార్మెంట్ కార్మికులకు కార్మిక చట్టాలు వర్తింప చేసే విధంగా సిఐటియు యూనియన్ గా పోరాడుతామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎగమంటి ఎల్లారెడ్డి , ఆడెపు సంపత్ , బెజుగం సురేష్ తదితరులు పాల్గొన్నారు

Previous లంచం తీసుకుంటూ ఏసీబీ కీ పట్టుబడ్డ హెడ్ కానిస్టేబుల్
Next ఎంపీపీ చేతుల మీదుగా పల్లె దవాఖానా ప్రారంభం
ADVERTISEMENT