Posted on 2026-05-15 16:22:30
డైలీ భారత్ స్పెషల్:
ఎల్ నినో నీడలో మనిషి.....
అడవుల గుండెలో గొడ్డలి గాయంతో
స్వచ్చమైన చల్లని గాలి ఆవిరి అయిపోయింది..!
కాలుష్యపు పొగలు ఎగసి
పక్షుల పాటల మాధుర్యం
మాయమైపోయింది..!
పచ్చదనం పెరిగితే చల్లని రేపు వస్తుంది అని
గ్రహించలేకపోతున్నాం..!
పచ్చని పంట పొలాలను వెంచర్లు చేస్తూ...
నేలతల్లి శరీరానికి తూట్లు పొడుస్తున్నాం
అని గ్రహించలేకపోతున్నాం..!
ఎల్ నినో ప్రకృతి శ్వాసలో పుట్టిన అలజడే
కాని .. మన పాపాల వేడితో అది ప్రళయగర్జనయి
మన మీదకు వస్తుంది..!
ఒక వైపు ఎండల తుపాను నేలని కాలుస్తుంటే...
మరో వైపు వరదల రాక్షసి ఊర్లను ముంచేస్తుంది
ఇది ప్రకృతి కోపం కాదు మనం చేసిన పాపం
ప్రళయగర్జనయి మన మీదకు వస్తుంది..!
కాబట్టి ఇప్పటికైనా మేలుకో మనిషీ...
ఒక మొక్క నాటు...
భూమి నవ్వేలా ప్రేమతో మొక్కను కాపాడి...
బావితరాల భవిష్యత్తును నిలబెట్టు..!
రచన: మంజుల పత్తిపాటి
మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్
యాదాద్రి భువనగిరి జిల్లా
తెలంగాణ రాష్ట్రం
చరవాణి 9347042218.
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >
100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు
Posted On 2026-09-04 12:11:03
Readmore >