| Daily భారత్
Logo




నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలను ప్రారంభించిన మాచారెడ్డీ మాజీ ఎంపీపీ నర్సింగ్ రావు

News

Posted on 2026-03-20 07:43:29

Share: Share


నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలను ప్రారంభించిన మాచారెడ్డీ మాజీ ఎంపీపీ నర్సింగ్ రావు

డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా, మాచారెడ్డీ మండలం, గజ్యా నాయక్ తండ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమానికి నర్సింగ్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సుదనమైన లక్ష్మి, కర్రెపు నర్సవ్వ వీరిద్దరి ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశము జరుపుకున్నారు.

ఈ కార్యక్రమంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లలో గృహప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. నర్సింగ్ రావు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఇందిరమ్మ ఇండ్ల పథకం నిరుపేదలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. లబ్ధిదారులకు నర్సింగ్ రావు శుభాకాంక్షలు తెలిపారు. 

సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర సమయంలో కూలిపోయిన ఇళ్లను చూసి చలించిపోయి, అధికారంలోకి రాగానే ఇళ్లను నిర్మించి ఇస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి గృహప్రవేశం చేయించడం ప్రభుత్వం, ప్రజల పట్ల ఉన్న నిబద్ధతకు నిదర్శనమని అన్నారు. గజ్యా నాయక్ తండాలో నిర్మాణంలో ఉన్న మరికొన్ని ఇందిరమ్మ ఇళ్లను కూడా త్వరలో పూర్తి చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. అనంతరం ఎల్లంపేటలో గ్రామ ప్రజలతో ఉగాది ఉత్సవాలలో పాల్గొని, అలాగే సేవాలాల్, జగదాంబ దేవి, హనుమాన్ ఆలయ పూజా కార్యక్రమంలో పాల్గొని, తిరిగి ప్రయాణమయ్యారు.

ఈ కార్యక్రమంలో, గ్రామ సర్పంచ్ వినోద ప్రభాకర్, ఉప సర్పంచ్ భిక్షపతి, పార్టీ ప్రెసిడెంట్ బన్సీ నాయక్, జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కొత్త అరవింద్, మాచారేడ్డి సర్పంచ్ సంతోష్, భవానిపేట మాజీ సర్పంచ్ మద్దేల రాజు, గ్రామస్తులు, పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.


Image 1

చెందిప్పలో దొంగల బీభత్సం....అడ్డుకున్న వృద్ధురాలిపై కిరాతక దాడి

Posted On 2026-09-11 03:39:31

Readmore >
Image 1

నిజాంసాగర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

Posted On 2026-09-10 15:22:16

Readmore >
Image 1

కామారెడ్డిలో రైస్ మిల్లర్ల మహా ధర్నా విజయవంతం...

Posted On 2026-09-10 15:19:28

Readmore >
Image 1

CMRF ద్వారా లక్ష్మణ్‌కు రూ.19,000 ఆర్థిక సహాయం

Posted On 2026-09-10 09:43:29

Readmore >
Image 1

ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి బలవన్మరణం

Posted On 2026-09-10 07:03:46

Readmore >
Image 1

వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలను అరెస్టు చేసిన జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్

Posted On 2026-09-10 07:02:32

Readmore >
Image 1

వాటర్ బాటిలు అధిక ధర.. రూ.7 లక్షలు ఫైన్!

Posted On 2026-09-09 17:17:04

Readmore >
Image 1

కోదాడలో 10 ఇళ్ల దొంగతనం కేసులు ఛేదింపు... రూ.60 లక్షల బంగారంతో హైదరాబాద్ దొంగ అరెస్ట్

Posted On 2026-09-09 14:45:53

Readmore >
Image 1

స్పీకర్ కు బీఆర్ఎస్ బహిరంగ క్షమాపణ చెప్పాలి

Posted On 2026-09-09 14:29:32

Readmore >
Image 1

దేమేకలాన్ పాఠశాలలో ఘనంగా కలోజి నారాయణరావు జయంతి వేడుకలు

Posted On 2026-09-09 14:28:15

Readmore >