ఓటర్ జాబితాలో అవకతవకలు లేకుండా స్పష్టమైన ఓటర్ల జాబితా రూపొందించాలి
కలెక్టర్ రాజర్షిషా వెల్లడి
డైలీ భారత్, మెదక్:నూతన ఓటరు నమోదు ఓటరు జాబితాలో సవరణలు మార్పులు తొలగింపులు భారత ఎన్నికల సంఘం నిబంధన పాటించాలి.... జిల్లా ఎన్నికల అధికారి/ జిల్లా కలెక్టర్. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో బిఎల్ఓ లు ఓటరు జాబితాను జాగ్రత్తగా పరిశీలించాలని జిల్లా కలెక్టర్/ జిల్లా ఎన్నికల అధికారి రాజర్షి షా తెలిపారు.
ఆదివారం మెదక్ మండలం మక్త భూపతిపూర్ లోని 123,124 పోలింగ్ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసి, ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా రెండు రోజులుగా కొనసాగిన ప్రత్యేక ఓటరు నమోదు కేంద్రాలలో ఓటర్ల నమోదు ప్రక్రియను పరిశీలించారు.
ఎలాంటి పొరపాట్లు, అవకతవకలు లేకుండా స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించాలని బూత్ స్థాయి అధికారులను ఆదేశించారు.
ఫోటో ఓటరు జాబితా రూపు కల్పనలో భాగంగా నూతన ఓటరు నమోదు, ఓటర్లు జాబితాలో సవరణలు, మార్పులు, తొలగింపులను భారత ఎన్నికల సంఘం నిబంధనలను పాటించాలని ఆదేశించారు.
ఓటరు జాబితాలో చనిపోయిన ఓటర్లు, 100కు పైగా వయసున్న ఓటర్లు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన ఓటర్లు, చిరునామా మారిన ఓటర్ల పై ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలని అన్నారు.
ఓటరు జాబితాలో ఉన్న అన్ని పేర్లను పరిశీలించాలన్నారు. ఓటరు జాబితా పై వచ్చిన అభ్యంతరాలపై దృష్టి కేంద్రీకరించాలని, అలాగే ఓటరు జాబితాలో తొలగింపులపై సైతం దృష్టి సారించాలని అన్నారు. బిఎల్ఓ లకు ఎన్ని దరఖాస్తులు వచ్చినది, ఎన్ని పరిష్కరించినది అడిగి తెలుసుకున్నారు.
బిఎల్ఓలు తమ పరిధిలోని అర్హత గల ప్రతిఒక్కరు ఓటు హక్కును పొందేలా చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్ డి ఓ అంబాదాస్ రాజేశ్వర్, తహసీల్దార్ శ్రీనివాస్ బిఎల్ఓ, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.