| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మూడు దశాబ్దాల పోలీసు సేవలకు ఘన వీడ్కోలు

మూడు దశాబ్దాల పోలీసు సేవలకు ఘన వీడ్కోలు

పదవీ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో ఆనందంగా ఆరోగ్యంగా గడపాలి

కుటుంబ సభ్యుల సమక్షంలో నిర్వహించిన  పదవీ విరమణ కార్యక్రమం

శాలువా, పూలమాలతో సత్కరించి  సాదరంగా సాగనంపిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర., ఐపిఎస్

డైలీ భారత్, కామారెడ్డి: పోలీసు వ్యవస్థలో దశాబ్దాల పాటు నిస్వార్థ సేవలు అందించి పదవీ విరమణ పొందుతున్న అధికారుల సేవలు వెలకట్టలేనివని జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్ కొనియాడారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై డి. శ్రీరామ్ మరియు కలెక్టర్ ఆఫీస్ ఎస్సై డి. ఉదయ్ శేకర్ ల పదవీ విరమణ కార్యక్రమాన్ని వారి కుటుంబ సభ్యుల సమక్షంలో అత్యంత ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్పీ పదవీ విరమణ పొందుతున్న అధికారులను, వారి సతీమణులను శాలువా మరియు పూలమాలలతో ఘనంగా సత్కరించి, జ్ఞాపికలను అందజేశారు. 

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ...

కుటుంబాలకు దూరంగా ఉంటూ, ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ప్రజల రక్షణ కోసం నిరంతరం శ్రమించడం గర్వకారణమని అన్నారు. ముఖ్యంగా ఉమ్మడి జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణలో వీరి పాత్రను అభినందించారు.

కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై డి. శ్రీరామ్ మరియు ఎస్సై డి. ఉదయ్ శేకర్ 1989లో పోలీసు కానిస్టేబుల్స్‌గా తమ వృత్తి జీవితాన్ని ప్రారంభించి, సుమారు 37 ఏళ్ల పాటు పోలీసు శాఖలో వివిధ హోదాల్లో అత్యుత్తమ సేవలు అందించారు. వీరిద్దరి సుదీర్ఘ ప్రస్థానం నిబద్ధతతో కూడినదని, దశాబ్దాల పాటు ప్రజల రక్షణ కోసం వారు చేసిన కృషి వెలకట్టలేనిదని జిల్లా ఎస్పీ గారు ఈ సందర్భంగా కొనియాడారు.

పోలీసు విధుల్లో వారు గడించిన అపారమైన అనుభవం, వృత్తి పట్ల చూపిన అంకితభావం నేటి యువ పోలీసు అధికారులకు ఎంతో స్ఫూర్తిదాయకమని ఎస్పీ గారు పేర్కొన్నారు. క్లిష్ట సమయాల్లోనూ ధైర్యంగా బాధ్యతలు నిర్వహించి, వ్యవస్థలో తమదైన ముద్ర వేసిన ఇలాంటి అధికారుల సేవలను శాఖ ఎల్లప్పుడూ స్మరించుకుంటుందని ఆయన అభినందించారు.

పదవీ విరమణ అనంతరం వీరు తమ శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో కలిసి పూర్తి ఆరోగ్యంతో, సుఖసంతోషాలతో గడపాలని ఎస్పీ గారు మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. 


ఈ కార్యక్రమంలో ఎస్బీ ఇన్స్పెక్టర్ మధుసూదన్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు సంతోష్, కృష్ణ, పోలీసు సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యుల కరతాళ ధ్వనుల మధ్య అధికారులకు సాదరంగా వీడ్కోలు పలికారు.

Previous సైన్స్ ఫెయిర్ లో పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్
Next ఎచ్ పివివ్యాక్సిన్ అంటే ఏమిటి?...దేనికి ఉపయోగం... ఎవరికి ఉపయోగం...ఏ రోగాన్ని నిరోధిస్తుంది!
ADVERTISEMENT