| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

డైలీ భారత్, వికారాబాద్ జిల్లా: వికారాబాద్‌లో విషాదం నెలకొంది. పట్టణంలోని గంగారాం సాయి బాబా కాలనీలో మహిళా కానిస్టేబుల్ బలిజ దివ్య ఆత్మహత్య చేసుకుంది.

బలిజ దివ్య కోటపల్లి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ధరూర్ సీఐ కార్యాలయానికి ఆమె అటాచ్‌గా పనిచేస్తున్నారు. అయితే శనివారం తెల్లవారుజామున తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు ఈ ఘటనపై విచారణ ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Previous రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు గాయాలు
Next స్పష్టమైన చూపు – సురక్షిత డ్రైవింగ్‌కు కీలకం
ADVERTISEMENT