మాజీ జెడ్పిటిసి శ్యాంసుందర్ రెడ్డి
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా మాజీ పార్లమెంట్ సభ్యులు మల్లురవిని నియమించడం హర్షనీయమని కొత్తూరు మాజీ జెడ్పిటిసి మామిడి శ్యాంసుందర్ రెడ్డి అన్నారు.
ఆదివారం హైదరాబాద్ లో మల్లురవిని కలుసుకున్న
శ్యాంసుందర్ రెడ్డి శాలువా పుష్పగుచ్చంతో మల్లురవిని సన్మానించారు. ఈ సందర్భంగా శ్యాంసుందర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సలహాదారులను నియమించిందనీ, ఈ మేరకు ఆదివారం ఉత్తర్వులు జారీచేసిందని పేర్కొన్నారు. వేం నరేందర్ రెడ్డి సీఎం వ్యవహారాలు, హర్కర వేణుగోపాల్ ప్రోటోకాల్, పబ్లిక్ రిలేషన్ వ్యవహారాలు, షబ్బీర్ అలీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ శాఖ, మల్లు రవి ఢిల్లీలో తెలంగాణ ప్రత్యేక ప్రతినిధిగా వ్యవహారిస్తారని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు ఇది మంచి శుభవార్త అని శ్యాంసుందర్ రెడ్డి తెలిపారు కష్టపడ్డ వారికి కాంగ్రెస్ ప్రభుత్వం మంచి గుర్తిస్తుందని పేర్కొన్నారు..