| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

నూతన సంవత్సర వేడుకలు శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలి ఎస్‌ఐ రమాదేవి సుజాతనగర్ మండలం

నూతన సంవత్సర వేడుకలు శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలి ఎస్‌ఐ రమాదేవి  సుజాతనగర్ మండలం

బాధ్యతతో జరుపుకుందాం – భద్రతతో జరుపుకుందాం

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం గ్రామ ప్రజలకు ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, శాంతియుతంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని కింది సూచనలు చేస్తున్నాము.డీజేలకు నిషేధం డిసెంబర్ 31న జిల్లాలో డీజేలు నిషేధించబడ్డాయి నిబంధనలను ఉల్లంఘిస్తే పరికరాలు స్వాధీనం చేసుకొని కేసులు నమోదుచేయడం జరుగుతుంది.మద్యం సేవించి వాహనాలు నడపడం నేరం

వేగంగా నడిపితే కేసులు నమోదు చేసి జైలుశిక్ష విధించడం జరుగుతుంది.ఆస్తుల ధ్వంసం, మహిళలపై అసభ్య ప్రవర్తనకు కఠిన చర్యలు ఇళ్లపై రాళ్లు విసిరినవారిపై, ప్రైవేట్ ఆస్తులు, పబ్లిక్ ఆస్తులు, వీధి దీపాలను ధ్వంసం చేసినవారిపై కఠిన చర్యలు తీసుకుంటాము.

మహిళలపై అసభ్యంగా ప్రవర్తించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాము.బైక్ రేసింగ్, ట్రిపుల్ రైడింగ్ నిషేధంబైక్ రేసింగ్ లేదా ముగ్గురు కలిసి ప్రయాణించిన వారిపై కేసులు నమోదు చేస్తాము.మాదక ద్రవ్యాలు, నిషేధిత మద్యం విక్రయాలపై చర్యలు

గంజాయి వంటి నిషేధిత మాదక ద్రవ్యాలు విక్రయించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము. మద్యం దుకాణాలు నిర్ణీత సమయానికిమూసివేయాలిమైనర్లకు మద్యంఅమ్మకాలుచేయరాదు.ప్రభుత్వ ప్రాంగణాల్లో లేదా బహిరంగ ప్రదేశాల్లో మద్యం అమ్మినవారిపైకేసులు నమోదు 

మైనర్లు వాహనాలు నడిపితే వారిపై కూడా కేసులు నమోదు చేస్తాము.ప్రజల సహకారం అవసరంపై నిబంధనల ఉల్లంఘన కనిపించిన వెంటనే 100 నంబర్‌కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నాము. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము.ఎవరూ ఇబ్బంది పడకుండా, కుటుంబ సభ్యులతో కలిసి శాంతియుత వాతావరణంలో నూతన సంవత్సరాన్ని జరుపుకోవాలని సుజాతనగర్ ఎస్ఐ ఏం.రమాదేవి తెలిపారు.

Previous ద్రాక్షారామంలో కలకలం.. కపాలేశ్వర స్వామి శివలింగం ధ్వంసం
Next సుజాతనగర్ మండలం హరిజనవాడ గ్రామంలో రోడ్డు మరమ్మతులు చేపట్టాలని గ్రామస్తుల ఆవేదన
ADVERTISEMENT