| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

దివంగత సీనియర్ జర్నలిస్టు రాఘవులు కుమార్తె వివాహ వేడుకల్లో పాల్గొన్న మంత్రి సీతక్క

దివంగత సీనియర్ జర్నలిస్టు రాఘవులు కుమార్తె వివాహ వేడుకల్లో పాల్గొన్న మంత్రి సీతక్క

నూతన వధూవరులను ఆశీర్వదించిన పలువురు ప్రముఖులు

డైలీ భారత్,భూపాలపల్లి:భూపాలపల్లి జిల్లా గణపురం మండల సీనియర్ జర్నలిస్టు కవి రచయిత, దివంగత సీనియర్ జర్నలిస్టు ముక్కెర రాఘవులు గౌడ్ ఏకైక కుమార్తె గౌతమి, వెంకటేశ్ ల వివాహ వేడుక భూపాలపల్లి మండలం మొరంచ పల్లి విజయ బాలాజీ గార్డెన్స్ లో జరగగా రాష్ట్ర పంచాయతీ రాజ్,గ్రామీణ అభివృద్ధి,  గ్రామీణ నీటి సరఫరా,  మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. మంత్రితోపాటు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, భూపాలపల్లి సిఐ దొమ్మాటి నరేష్ కుమార్ గౌడ్ గణపురం తహసిల్దార్ మధురకవి సత్యనారాయణ స్వామి ఎంపీడీవో ఎల్ భాస్కర్, గణపురం ఎస్ఐ రేఖ అశోక్ లు వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.

వివాహ వేడుకలో స్థానిక జర్నలిస్టు లతో భూపాలపల్లి జిల్లా సిఐ దొమ్మాటి నరేష్ గౌడ్

Previous హనుమకొండ స్వేరోస్ జిల్లా అధ్యక్షులుగా మంద మనోజ్ ని నియమించిన రాష్ట్ర కార్యవర్గం
Next చలిలో ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి : కె.నరసింహ ఐపిఎస్, ఎస్పి సూర్యాపేట జిల్లా
ADVERTISEMENT