| Daily భారత్
Logo




పోలీస్ శాఖ ఆద్వర్యంలో 150 సంవత్సరాల వందేమాతరం గీతం ఆలవన వేడుకల నిర్వహణ

News

Posted on 2025-11-07 13:10:01

Share: Share


పోలీస్ శాఖ ఆద్వర్యంలో 150 సంవత్సరాల వందేమాతరం గీతం ఆలవన వేడుకల నిర్వహణ

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి.సాయి చైతన్య ఆధ్వర్యంలో 150 సంవత్సరాల వందేమాతరం  గీతం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్  భారతమాత ఫోటోకు పూలమాలలు వేసిన అనంతరం, పోలీస్ కమిషనర్  మాట్లాడుతూ ఈ పదం మన ప్రతి భారతీయుడి గుండెల్లో దేశభక్తి జ్వాల రగిలించే శక్తిని కలిగి ఉంది. బంకించంద్ర చట్టోపాధ్యాయ రచించిన ఈ గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ సందర్భం మనందరికీ గర్వకారణం. ఈ గీతం మన స్వాతంత్య్రసమరయోధులకు ప్రేరణ గా నిలిచినట్లే, నేటి తరం యువతకు దేశప్రేమ కర్తవ్యనిష్ట ఐక్యత అనే విలువలను స్ఫూర్తిగా అందిస్తుందని, ఈ మహోత్సవ సందర్భంగా మన దేశపు తల్లి భూమికి మనమందరం వందనం చేయాలన్నారు. "వందేమాతరం " అని ఆలపించడం కేవలం ఒక గీతం పాడడం కాదు, అది మన తల్లి దేశానికి ఇచ్చే గౌరవ ప్రధమైన ప్రమాణం అని తెలియజేశారు. ఈ సందర్భంగా అదనపు డి.సి.పి (ఎ.ఆర్) రామ చందర్ రావ్ ,ఆఫీస్ సూపరింటెండెంటులు  శంకర్,బషీర్, రిజర్వు ఇన్స్పెక్టర్స్ శ్రీనివాస్, తిరుపతి, సి.సి.ఆర్.బి సిబ్బంది, పోలీస్ కంట్రోల్ రూమ్ సిబ్బంది, సెంట్రల్ కాంప్లెంటు సెల్ సిబ్బంది, డి.పి.ఓ సిబ్బంది, హెడ్క్వార్టర్స్ సిబ్బంది, హోమ్ గార్డ్సు సిబ్బంది హాజరయ్యారు.


Image 1

హమాలీల సంఖ్య పెంచి అన్ లోడింగ్ చేయాలి: సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-05-26 10:43:36

Readmore >
Image 1

కామారెడ్డి జిల్లాలో ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ పై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-05-26 08:13:24

Readmore >
Image 1

జీవ నదులను కాపాడుకోకపోతే భవిష్యత్తే ఉండదు : పవన్ కళ్యాణ్

Posted On 2026-05-26 07:43:54

Readmore >
Image 1

కొత్తగూడెం అభివృద్ధిపై సీఎం వద్ద కూనంనేని గళం

Posted On 2026-05-25 21:25:57

Readmore >
Image 1

సీతారామ ప్రాజెక్టుతో 10 లక్షల ఎకరాలకు సాగునీరు లక్ష్యం

Posted On 2026-05-25 19:54:35

Readmore >
Image 1

మహిళ సంఘ భవనం కోసం భూమి పూజ నిర్వహించిన సర్పంచ్

Posted On 2026-05-25 19:25:02

Readmore >
Image 1

మైనర్ బాలిక పై లైంగిక దాడికేసు లో జీవిత కాలం జైలు శిక్ష

Posted On 2026-05-25 19:19:35

Readmore >
Image 1

లైసెన్స్ సర్వేయర్లకు గౌరవ వేతనం ప్రకటించాలి

Posted On 2026-05-25 19:18:11

Readmore >
Image 1

ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

Posted On 2026-05-25 17:20:28

Readmore >
Image 1

అర్జీలు సకాలంలో పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-05-25 17:15:49

Readmore >