| Daily భారత్
Logo




రాష్ట్రస్థాయి ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్ మరియు విద్యార్థులకు వ్యాస రచన పోటీలకు ఆహ్వానం : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, IPS

News

Posted on 2025-10-16 22:07:14

Share: Share


రాష్ట్రస్థాయి ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్ మరియు విద్యార్థులకు వ్యాస రచన పోటీలకు ఆహ్వానం : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, IPS

డైలీ భారత్, వరంగల్: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం (పోలీస్ ఫ్లాగ్ డే)ను పురస్కరించుకొని జిల్లా పరిధిలో గల ఔత్సహిక ఫోటోగ్రాఫర్లకు ఫోటోగ్రఫీ మరియు షార్ట్ ఫిల్మ్ కు సంబంధించి, మరియు విద్యార్థులకు వ్యాసరచన పోటీలకు సంబంందించి తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో పోటీలను నిర్వహిస్తున్నట్లుగా వరంగల్ పోలీస్ కమిషనర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలీస్ ఫ్లాగ్ డే సందర్బంగా పోలీస్ అమరవీరుల ప్రాణ త్యాగాలను స్మరిస్తూ ఈ నెల 21 నుండి పలు కార్యక్రమాలను నిర్వహించబడుతాయని తెలిపారు. ఇందులో భాగంగా విద్యార్థులతో పాటు, యువత ఔత్సాహిక ఫోటోగ్రాఫర్లు ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్స్ పోటీలలో ఉత్సాహంగా పాల్గొనాలని కోరారు. ఇందులో భాగంగా పోలీసుల త్యాగాలు, పోలీసు విధుల్లో పోలీసుల ప్రతిభను తెలిపే విధంగా ఉండే ఇటీవల కాలంలో తీసిన (03) ఫోటోలు మరియు తక్కువ నిడివి (03 నిమిషాలు) గల షార్ట్ ఫిలిమ్స్ తీసి రాష్ట్రస్థాయి పోటీల కోసం ఈ నెల 25వ తేదీ లోపు జిల్లా వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సంబంధిత షార్ట్ ఫిల్మ్ లోడ్ చేసిన పెన్ డ్రైవ్, 10 x 8 సైజ్ ఫోటోలను పోలీస్ పిఆర్వో  కు అందజేయాలన్నారు.

ఈ పోటీలకు నామినేషన్లు పంపించే ఔత్సహికులు

మూడనమ్మకాలు, ఇతర సామాజిక రుగ్మతలు

అత్యవసర సమయాల్లో పోలీసులు స్పందన

ప్రకృతి వైపరిత్యాల్లో పోలీసుల సేవ

ఇతర సందర్భాల్లో పోలీసుల కీర్తి ప్రతిష్టలను

 సైబర్ నేరాలు ఈవ్ టీజింగ్,ర్యాగింగ్*  

మత్తు పదార్థాల సేవనం వాటి అనర్దాలు

 మరియు అవగాహన పెంపొందించే అంశాలకు సంబంధించి గత సంవత్సరం 2024 అక్టోబర్ నుండి ప్రస్తుత సంవత్సరం అక్టోబర్ నెల ఇప్పటివరకు తీసిన మూడు ఫోటోలు, షార్ట్ ఫిల్మ్ లు మాత్రమే పంపించాల్సి వుంటుంది. ఈ నెల 25 వ తారీఖు లోపు వరంగల్ సీపీ కార్యాలయంలోని పి.ఆర్.ఓ కు అందజేయాల్సి వుంటుందని తెలిపారు.

విద్యార్థులకు వ్యాస రచన పోటీలు

పోలీస్ ఫ్లాగ్ డే సందర్బంగా తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో  విద్యార్థులకు ఆన్‌లైన్ వ్యాసరచన పోటీలు (Essay Writing Competition) నిర్వహించడం జరుగుతుందని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, IPS తెలిపారు. ఈ పోటీలు మూడు భాషల్లో తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో 6వ తరగతి నుండి పీజీ వరకు ఉన్న విద్యార్థులు పాల్గొనవచ్చని తెలియజేసారు. విద్యార్థులు తమ వ్యాసాలను అక్టోబర్ 28 వ తేదీ లోగా సమర్పించాలని, ఉత్తమ ప్రతిభ కనబరిచిన ముగ్గురు విద్యార్థులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేయడం జరుగుతుంది అంతే కాకుండా కమిషనరేట్ స్థాయిలో 1వ, 2వ, 3వ స్థానాల్లో విజేతలకు బహుమతులు కూడా ప్రదానం చేయబడతాయని అన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జిల్లా, రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచి బహుమతులు పొందాలని సీపీ సూచించారు.

వ్యాసరచన అంశం (Essay Topic):

“Drugs Menace: Role of Police in Prevention and How Students Can Stay Away from Drugs"

(డ్రగ్స్ నివారణలో పోలీసుల పాత్ర మరియు విద్యార్థులు డ్రగ్స్‌ నుండి ఎలా దూరంగా ఉండగలరు)

పోటీలో పాల్గొనే విధానం

1.కింద ఇవ్వబడిన లింక్‌పై క్లిక్ చేసి పాల్గొనండి:

 https://forms.gle/jaWLdt2yhNrMpe3eA

2.మీ పేరు, విద్యార్హత మరియు ఇతర వివరాలు నమోదు చేయండి.

3.వ్యాసాన్ని పేపర్‌పై రాసి, దానిని చిత్రం (image) లేదా PDF ఫార్మాట్‌లో (500 పదాలు మించకూడదు) అప్‌లోడ్ చేసి సబ్మిట్ చేయండి.

మరిన్ని వివరాల కోసం 8712685050 నెంబర్ ద్వారా పీఆర్ఓ ను సంప్రదించాలన్నారు. సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం శ్రమించి అసువులు బాసిన పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ నిర్వహించబోయే కార్యక్రమాలలో, పోటీలలో విధ్యార్థులతో పాటు, ఔత్సాహికులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాలన్నింటినీ విజయవంతం చేయాల్సిందిగా వరంగల్ సీపీ పిలుపునిచ్చారు.

Image 1

జీవన రక్ష అవార్డు గ్రహీత డాక్టర్ పల్స హరీష్ గౌడ్

Posted On 2026-07-01 17:29:10

Readmore >
Image 1

దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం

Posted On 2026-07-01 17:28:05

Readmore >
Image 1

మహబూబాబాద్ జిల్లా సింగారం గ్రామంలో మాజీ సర్పంచ్ దారుణ హత్య

Posted On 2026-07-01 16:22:02

Readmore >
Image 1

"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"

Posted On 2026-07-01 07:14:21

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు

Posted On 2026-06-30 18:35:12

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే

Posted On 2026-06-30 18:09:24

Readmore >
Image 1

ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య

Posted On 2026-06-30 18:03:18

Readmore >
Image 1

మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు

Posted On 2026-06-30 18:02:24

Readmore >
Image 1

శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ

Posted On 2026-06-30 18:00:06

Readmore >
Image 1

పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్

Posted On 2026-06-30 17:58:38

Readmore >