| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

స్థానికులతో ప్రాణహాని ఉంది

స్థానికులతో ప్రాణహాని ఉంది

మీడియా సమావేశంలో ఒంటరి మహిళ ఆవేదన

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ప్రహరీ గోడ విషయంలో స్థానికుల నుండి తనకు ప్రాణహాని ఉందని ఒంటరి మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో  ఆమె మాట్లాడారు. నిజామాబాద్ జిల్లాలోని డొంకేశ్వర్ జి జి నదకుడ గ్రామానికి చెందన మాడవేడి గోదావరి తన ఆవేదనను వెలిబుచ్చారు. గ్రామంలోని తన సొంత ఇంటికి సంబంధించి గ్రామపంచాయతీ అనుమతి ప్రకారం ప్రహరీ గోడను నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. చుట్టుపక్కల అయితే ఈ గోడను నిర్మించుకోకుండా తమ చుట్టుపక్కల ఉండే కొమరం వెంకటి అతని భార్య నాగమణి, కొమురం లక్ష్మి, మగ్గిడి అలియాస్ బుర్కా రవి, జవ్వాజి రాజేశ్వర్ గౌడ్, జవ్వాజి శేఖర్ గౌడ్, బొంగోని రాజా గౌడ్, మగ్గిడి గంగుబాయిలపై చట్టరీత్యా పోలీసులు చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని ఆమె కోరారు. ఇటీవల కాలంలో తన ఇంటి వద్దకు వచ్చి వారు గొడవలు చేస్తున్నారని, దుర్భాషలాడుతూ దాడులకు పాల్పడుతున్నారని తనను హత్య చేస్తానని  బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆమె వాపోయారు. దీనిపై నందిపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు మామూలు కేసుగా కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారని గోదావరి ఆరోపించారు. పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన తనను వేధించడం లేదని, వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వారి నుంచి వారి నుంచి తనకు ఎప్పటికైనా ప్రాణహాని ఉందని ప్రజావాణిలో జిల్లా కలెక్టర్కు, జిల్లా పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేయడం జరిగిందని ఆమె తెలిపారు.

Previous అక్టోబర్ లోగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలి : కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
Next మట్టి వినాయకులనే ప్రతిష్టించాలి : జెడ్పీహెచ్‌ఎస్ అంబేద్కర్ నగర్, సిరిసిల్ల పాఠశాల విద్యార్థులు
ADVERTISEMENT