ఘనంగా స్వాగతం పలికిన భాజపా శ్రేణులు
నీలకంఠేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన రామచంద్రరావు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజాంబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనానికి బిజెపి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్ చందర్రావు జిల్లాకు చేరుకున్నారు. మొదటగా జిల్లాలోని ఇండల్వాయి టోల్ ప్లాజా నుండి బిజెపి కార్యకర్తలు నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం నిజామాబాద్ లోనే ప్రసిద్ధిగాంచిన శ్రీ నీలకంటేశ్వర ఆలయంలో ఆయనకు వేద పండితులు పూర్ణకుంభంతో ఆహ్వానం పలికి ఆలయంలోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆలయం నుండి బయటకు వచ్చిన ఆయనకు బిజెపి శ్రేణులు గజమాలతో సత్కరించారు. అనంతరం అక్కడి నుండి బైక్ ర్యాలీ ద్వారా ఆర్మూర్ రోడ్డు లో గల శ్రీరామ గార్డెన్ లో ఏర్పాటు చేసిన కార్యకర్తల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్నారు.