అనురాగ మూర్తి
మహిళా నీవు మహిలో మేటి
నీకెవరు సాటి
కూతురై పుట్టి కూర్మి పంచి...
అక్క లా ఆదరణ చూపించి...
చెల్లి వలె చెలిమి నందించి....
పతికి సతిగ మారి బాధ్యత లను పంచుకొని
ధైర్యమే నీవయి ముందు నడిపి
అమ్మ గా అనురాగమును పంచి
మంచి చెడులు తెలుపు మహనీయురాలివై
ఆకాశమంత విశాల హృదయం నీది.....
సహనం లో భూదేవి నీవు.....
పుట్టుకనిచ్చే పట్టపు రాణి వైనా
నీ కుటుంబ పరివారానికి సేవకు రాలివే....
ఆప్యాయతను పంచె నదీ ప్రవాహానివైనా.....
నీ జీవన గమనంలో...... అడుగడుగునా అడ్డంకులే
నీకై ఏది ఆశించవు....
అందరి క్షేమముకై పరితపిస్తావు
పట్టుదలకు మరో రూపు నీవు....
విజయ పథంలో ముందడుగు నీవు....
అలలా ఎగిసిపడే కెరటం లా నీ కోపం
అంతలోనే శాంత రూపమై భువిని చేరు
అన్నిటా నీదే ముందు స్థానం....
ఆగనిది నీ కష్టాల ప్రస్థానం!
హృదయం నిండా బాధలెన్ని ఉన్నా....
చిరునవ్వె నీ చెరగని ధైర్యం!
ఓ మహిళా నీకు జోహార్లు!!
అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
ముంజ రమ,
ఎస్. ఎ తెలుగు,
జి.ప. ఉ.పా.చంద్రంపేట,
రాజన్న సిరిసిల్ల.