| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మహిళా మణులందరికి అంతర్జాతీయ మహిళాదినోత్సవ శుభాకాంక్షలు

మహిళా మణులందరికి అంతర్జాతీయ మహిళాదినోత్సవ శుభాకాంక్షలు

మహిళామణి

సృష్టికి ఆమే ప్రతిరూపం

జగతిన తానే మణిదీపం

ప్రేమను పంచు తన హృదయం

మహిళే మహిన మరుదైవం

అన్ని బంధముల ఆత్మీయతవై

అనురాగమునే పంచేవు

అలజడులన్ని అలలై ఎగసిన....

ఎదురుగ  నిలిచి పోరాడే 

చెరగని ధైర్యం నీదమ్మా.... 

ఓర్పు, నేర్పు, సహనం చూపి

విజయ పథం లో నడిచావమ్మా...

పట్టుదలకు నువు ప్రాణంపోసి   

పథకాలెన్నో గెలిచావమ్మా.....

ఎంత ఎత్తుకెదిగిన ఒదిగి ఉండే గుణం నీదమ్మా....

ఆదర్శ మూర్తి వందనం.

మహిళా మణులందరికి అంతర్జాతీయ మహిళాదినోత్సవ శుభాకాంక్షలు

ముంజ రమ,

ఎస్. ఎ  తెలుగు,

జి. ప. ఉ.పా.చంద్రంపేట,

రాజన్న సిరిసిల్ల.

Previous ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ...లక్షల్లో డబ్బు, బంగారం స్వాహా చేసిన నిందితుడి అరెస్టు
Next అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు : ముంజ రమ
ADVERTISEMENT