| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కన్నా తల్లిని కత్తితో పొడిచి హత్య చేసిన కొడుకు

కన్నా తల్లిని కత్తితో  పొడిచి హత్య చేసిన కొడుకు

 పటాన్చెరు, డైలీ భారత్ న్యూస్:  ఆస్తి‌ కోసం కొడుకు తన కన్న తల్లిని కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.‌ 

సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని డివినోస్ విల్లాస్ లో తాగుడుకు బానిస అయిన కార్తీక్ రెడ్డి (26) ఆస్తి కోసం తరచూ కుటుంబ సభ్యులతో గొడవ పడుతున్నాడు. ఈ రోజు తెల్లవారు జామున తల్లి రాధిక (52) ను కార్తీక్ కత్తితో దాడి చేశాడు. రక్తపు మడుగులతో ఉన్న రాధికను కుటుంబ సభ్యులు హుటాహుటిన నల్లగండ్ల లోని సిటిజన్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందింది. ఘటనా స్థలానికి చేరుకున్న కొల్లూరు పోలీసులు నిందితున్ని అదుపులోకి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పటాన్‌చెరు ఏరియా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Previous నిరుపేద వివాహ కుటుంబానికి చేయూతనిచ్చిన మాజీ కౌన్సిలర్ కల్లూరి రాజు
Next అఖిలపక్ష రైతు సంఘాలు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతులు ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న లకావత్ గిరిబాబు
ADVERTISEMENT