| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కళాశాల నిర్మాణంలో మొదటి అంతస్తు స్లాబ్ కు పూజలు చేసిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

కళాశాల నిర్మాణంలో మొదటి అంతస్తు స్లాబ్ కు పూజలు చేసిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

అకుంఠిత దీక్షతో శరవేగంగా కళాశాల భవన నిర్మాణం..!

దాతలు ప్రజల సహకారంతో విధంగా ముందడుగు

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా; ఎక్కడ లేని విధంగా గ్రామ ప్రజలు దాతల సహకారంతో కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనం స్వచ్ఛందంగా నిర్మించి ప్రభుత్వానికి అప్పజెప్పే ప్రయత్నం ఓ మహా యజ్ఞంలా కొనసాగుతుందని షాద్ నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ అన్నారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల భవన నిర్మాణానికి మొదటి అంతస్తు స్లాబ్ పనులను ఎమ్మెల్యే వీళ్ళపల్లి శంకర్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ తదితర నాయకులు మీడియా ప్రతినిధులు పాల్గొని శ్రమదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల సహకారం దాతల ఔదార్యంతో ప్రభుత్వ జూనియర్ కళాశాల భవన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు. కళాశాల అభివృద్ధికి సహకరిస్తున్న ప్రతి దాతకు తాను శిరస్సు వంచి నమస్కరిస్తున్నారని అన్నారు. స్థానిక మీడియా సహకారంతో ఎంతో గొప్ప సంకల్పంతో  అకుంఠిత దీక్షతో కళాశాలను నిర్మించేందుకు ముందుకు సాగుతున్నామని అన్నారు. మరో రెండు మూడు నెలల్లో రెండవ అంతస్తు స్లాబ్ నిర్మాణం జరుగుతుందని అన్నారు. పేద ప్రజల బిడ్డలు అత్యున్నత వసతులతో నాణ్యమైన విద్యను అభ్యసించాలనే ఉద్దేశంతో తాను ఈ సంకల్పాన్ని నెరవేర్చుతున్నట్లు తెలిపారు. తన సంకల్పానికి తోడుగా దాతలు ఎంతో పెద్ద మనసుతో ముందుకు వచ్చి కళాశాల నిర్మాణానికి తమ వంతు సహకారం చేయడం జీవితంలో ఎన్నడు మర్చిపోలేనిదని అన్నారు. ఎన్నివేయ ప్రయాసలు ఇబ్బందులు ఎదురైనా కళాశాల భవన నిర్మాణం పూర్తి చేస్తామని అన్నారు. ఎంతోమంది తమకు తోచిన ఆర్థిక సహకారం కళాశాలకు అందిస్తున్నారని వారికి పేరుపేరునా కృతజ్ఞతలు ఎమ్మెల్యే తెలిపారు. తనొక్కడినే కాకుండా ఇతరుల భాగస్వామ్యంతో నిర్మిస్తున్న ఈ కళాశాలకు అత్యంత గొప్ప వైభవం చేకూర్చుతామని ఎమ్మెల్యే శంకర్ అన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన పలువురు ప్రముఖులు నాయకులు కార్యకర్తలు మీడియా ప్రతినిధులు ఎమ్మెల్యే శంకర్ అభినందనలు తెలిపారు.

Previous ఇంటికే ఇసుక.. బుకింగ్కు ప్రత్యేక యాప్
Next జెక్కిడి శివ చరణ్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన షాద్ నగర్ యూత్ కాంగ్రెస్ నాయకులు
ADVERTISEMENT