తెలంగాణ అఖిల భారత బ్రాహ్మణ మహా సంఘ్ అధ్యక్షులు శ్రీకాంత్ మున్షీ
పటాన్చెరు, డైలీ భారత్:సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కొడకంచి గ్రామంలోని శ్రీ ఆదినారాయణ స్వామి ఆలయ ఆలయాన్ని తొలిసారిగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిగా తెలంగాణ అఖిలభారత బ్రాహ్మణ మహా సంఘ్ అధ్యక్షుడు శ్రీకాంత్ మున్షి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని తెలంగాణలో కెల్లా వేయ్యేలా చరిత్ర కలిగిన ప్రసిద్ధి చెందిన ఆలయం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఆదినారాయణ స్వామివారి ఆలయం ఇక్కడ బంగారు బల్లి వెండిబల్లి ఎంతో విశేషమని పేర్కొన్నారు. నేటి నుండి బ్రహ్మోత్సవాలు మొదలుకొని 10వ తేదీ వరకు ఉంటాయని 8వ తేదిన ముఖ్య ఘట్టమని జాతర రథయాత్ర ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో అఖిల భారత బ్రాహ్మణ మహా సంఘ్ అధ్యక్షుడు శ్రీకాంత్ మున్షీ, వేణుగోపాలరావు, ఆలయ కమిటీ చైర్మన్ రామోజీరావు, ధర్మకర్తలు కొండల్ రావు, వెంకట మల్లికార్జున్, శ్రీనివాస్ రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.