| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

నందమూరి బాలకృష్ణ పద్మ భూషణ్ అవార్డు, సంబరాలు

నందమూరి బాలకృష్ణ పద్మ భూషణ్ అవార్డు, సంబరాలు

నందమూరి తారక రామారావు అభిమాన సంఘం ఆధ్వర్యంలో సంబరాలు

 రామచంద్రపురం, డైలీ భారత్:బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఛైర్మన్, నటుడు నందమూరి బాలకృష్ణకు  సినీ రంగానికి చేసిన సేవలకు గానూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్‌ అవార్డు ప్రకటించిన విషయం తెలిసిదే .

ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం   నందమూరి తారకరామారావు అభిమాన సంఘం అధ్యక్షులు బి కే యాదయ్య ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు 

నిబద్ధత, క్రమశిక్షణ, పట్టుదలతో  సమాజం పట్ల బాధ్యతాయుతమైన జీవనశైలిని అవలంబిస్తూ  మనకెంతో ఇచ్చిన సమాజానికి మనం ఏదైనా తిరిగి ఇవ్వాలనే దృక్పథం కలిగిన నందమూరి బాలకృష్ణ కు  పద్మభూషణ్ అవార్డు రావడం ఎంతో ఆనందంగా ఉందని  నందమూరి తారక రామారావు అభిమాన సంఘం రామచంద్రపురం అధ్యక్షులు బి కే యాదయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో కే నాగేష్, సి నరసింహ, బి బీరప్ప, శివరాజ్, ఎస్ శ్రీకాంత్ కాజా, రాజు నాగేష్ ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు.

Previous శ్రీ ఆదినారాయణ స్వామిని దర్శించుకున్న... శ్రీకాంత్ మున్షీ
Next భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ లీగల్ సేల్ చైర్మన్ గా సీనియర్ న్యాయవాది వెల్లంకి వెంకటేశ్వర రావు
ADVERTISEMENT