| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

300 కోట్ల కుంభకోణం: శ్రీలక్ష్మి శ్రీనివాస కన్‌స్ట్రక్షన్ యజమాని గుర్రం విజయలక్ష్మి అరెస్ట్

300 కోట్ల కుంభకోణం: శ్రీలక్ష్మి శ్రీనివాస కన్‌స్ట్రక్షన్ యజమాని గుర్రం విజయలక్ష్మి అరెస్ట్

డైలీ భారత్, హైదరాబాద్, దుండిగల్: గత ఏడేళ్లుగా GLC విల్లా ప్రాజెక్టులో మోసపూరిత వ్యవహారాలకు పాల్పడి 400 కోట్ల కుంభకోణం చేసిన ఎన్ఆర్ఐ గుర్రం విజయలక్ష్మిని గురువారం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అరెస్ట్ చేసి 14 రోజుల రిమాండ్‌కు తరలించారు.

ఇలాంటి మోసాలకు అడ్డుకట్ట వేయాలంటే HMDA, మున్సిపల్, గ్రామ పంచాయతీ అధికారులు అనుమతులు మంజూరు చేసే సమయంలో అవినీతి లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు. బాధితులకు అన్యాయం జరుగకుండా ప్రమాదకర నిర్మాణాలకు అనుమతులు ఇచ్చే అధికారులపై కూడా విచారణ జరపాలి అని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

కేవలం అరెస్ట్ కాదు, సహకరించిన అధికారులపై చర్యలు తప్పనిసరి

గుర్రం విజయలక్ష్మికి సహకరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, పదవి నుండి తొలగించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. అవినీతి నిరోధక శాఖ (TelanganaACB) చిన్న ఉద్యోగులపై కాకుండా, ఇలాంటి భారీ మోసాలకు సహకరించిన అధికారులపై దృష్టి సారించాలని కోరుతున్నారు.

మేడ్చల్‌ జిల్లా పరిపాలన వైఫల్యంపై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా కలెక్టర్ (Collector Medvhal Malkajgiri), ఇద్దరు అదనపు కలెక్టర్లు ఉన్నా, ఈ విధంగా అక్రమాలు జరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. 

బహుదూర్‌పల్లి సర్వే నెం.227లో 353.35 ఎకరాల భూమి విషయంలో ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోనుందో అనే ప్రశ్నలు వస్తున్నాయి. 

ధరణి రిజిస్ట్రేషన్‌లు, బహిరంగ రిజిస్ట్రేషన్‌లు చేసిన అధికారులపై విచారణ జరిపించాలనే డిమాండ్‌ ప్రజల్లో పెరుగుతోంది.

Previous వేల గొంతులు-లక్ష డప్పుల కార్యక్రమానికి మద్దతుగా డప్పులు అందించిన ఆదివాసీ నాయకులు తంబల్ల రవి
Next సిఎం రేవంత్ రెడ్డిని కలిసిన సి.పెంటయ్య
ADVERTISEMENT