| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

పేకాట స్థావరాలపై చండ్రుగొండ పోలీసుల దాడి

పేకాట స్థావరాలపై చండ్రుగొండ పోలీసుల దాడి

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: చండ్రుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాలను అరికట్టే లక్ష్యంతో పోలీసులు పటిష్ఠమైన చర్యలు తీసుకుంటున్నారు.  చండ్రుగొండ ఎస్సై శివరామకృష్ణ  సిబ్బందితో కలిసి తిప్పనపల్లి గ్రామ శివారు ప్రాంతంలో పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు ఆకస్మిక దాడి నిర్వహించారు.దాడిలో నలుగురు వ్యక్తులు పట్టుబడగా, వారి వద్ద నుండి మూడు సెల్ ఫోన్లు, రూ. 5,160 నగదు, మరియు మూడు మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు చట్ట విరుద్ధమైన క్రియాకలాపాలు చేయడం నేరం మాత్రమే కాకుండా వ్యక్తిగత జీవితానికీ, కుటుంబానికీ హానికరం. ప్రజలందరూ ఇలాంటి వ్యసనాలకు దూరంగా ఉండి సమాజంలో శాంతి, భద్రతలను కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నాము.

ఎవరైనా ఇలాంటి చట్ట విరుద్ధమైన చర్యల్లో పాల్గొంటే, వారిపై కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. ప్రజలు ఏ విధమైన నేర సంబంధిత సమాచారం ఉన్నా 100 నంబర్‌కు కాల్ చేయండి లేదా చండ్రుగొండ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించండి. మీ సమాచారం గోప్యంగా ఉంచబడుతుంది.

Previous భద్రాచలం ఏరియా ఆసుపత్రికి మోక్షం ఎప్పుడు : జాతీయ మానవ హక్కుల సంఘం
Next మద్యం బెల్ట్ షాపులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కి వినతి పత్రం ఇచ్చిన మహిళా మండలి జిల్లా అధ్యక్షురాలు షేక్ జాన్ బి
ADVERTISEMENT