డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూ సర్వే ప్రక్రియలో భాగంగా వైరా నియోజకవర్గం జూలూరుపాడు మండలం పాపకొల్లు రెవిన్యూ గ్రామాన్ని సర్వే ప్రక్రియ కోసం" పైలెట్ ప్రాజెక్టు" కింద ఎంపిక చేయటం జరిగిందన్నారు
వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ పాపకొల్లు గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ ప్రాంతం రైతాంగం పెద్ద ఎత్తున తరలివచ్చి పాపకొల్లు బొడ్రాయి సెంటర్ నందు పాలాభిషేకం కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు తరాలుగా ఉన్న తాతల ముత్తాతలకాలం నాటి భూములకు పట్టాలు లేక, హక్కులు పొందలేక ఇన్నేళ్లుగా ఇబ్బంది పడుతున్న ( అన్ని విధాలుగా నష్టపోయిన) ఆ ప్రాంత రైతులు హర్షం వ్యక్తం చేసినారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కాంగ్రెస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు రోకటి సురేష్ , మున్నూరు కాపు జూలూరుపాడు మండల అధ్యక్షులు రామిశెట్టి రాంబాబు, పాపిన్ని జనార్ధన్, మరియు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ యూత్, రైతులు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు