| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

గౌరవరాజుల వెంకటేశ్వర్ రావును సన్మానించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

గౌరవరాజుల వెంకటేశ్వర్ రావును సన్మానించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా :తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ షాద్ నగర్ నియోజక స్థాయిలో ఎన్నికలు నిర్వహించగా గౌరవ రాజుల వెంకటేశ్వరరావు అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికవ్వడం జరిగింది. ఈ సందర్భంగా గురువారం షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ను  నియోజక వర్గంలోని బ్రాహ్మణ పెద్దలు మర్యాద పూర్వకంగా కలుసుకొని వారికి ఆశీర్వచనం ఇవ్వడం జరిగింది. శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ బ్రాహ్మణులు దైవాంశ సంభూతులు వారికి ఎలాంటి సహాయ సహకారాలు అయినా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని, అలాగే పండగల విషయంలో బ్రాహ్మణులు ఏకతాటిపై నిర్ణయం తీసుకొని పండుగలు అన్నీ కూడా ఒక తేదీ పై జరిగేటట్టు నిర్ణయం తీసుకోవాలని తెలియజేశారు బ్రాహ్మణులకు అవసరమైనటువంటి స్థలము మరియు భవన నిర్మాణానికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని బ్రాహ్మణులకు హామీ ఇచ్చారు, అనేక సంఘాలు ఏర్పడకుండా ఒకటే సంఘం ఏర్పాటు చేసి అధ్యక్షులు కార్యవర్గము సంఘానికి సముచిత న్యాయము చేయాలని వారు ఆకాంక్షించారు . నూతనంగా ఎన్నికైన గౌరవ రాజుల వెంకటేశ్వరరావు గౌరవ శాసనసభ్యులను శాలువాతో సన్మానించారు. గౌరవ రాజుల వెంకటేశ్వరరావు అధ్యక్షులు మాట్లాడుతూ సంఘానికి ఎల్లవేళలా తన శాయశక్తుల కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గౌరవరాజుల వెంకటేశ్వరరావు, రంగారెడ్డి జిల్లా బ్రాహ్మణ సేవా సమాఖ్య ఉపాధ్యక్షులు రవిశర్మ , భాను శర్మ గారు రఘునాథ శర్మ  రామసత్యనారాయణ శర్మ  రాజశేఖర్ శర్మ వెంకటాచారి ప్రవీణ్ శర్మ శ్రీనివాసచార్యులు మధుసూదనాచార్యులు నరసింహయ్య కిట్టు పంతులు కిరణ్ పంతులు మణి పంతులు సాయి పంతులు రఘుపతి అయ్యగారు నాగరాజు పంతులు ఫణీంద్ర శర్మ సునీల్ కుమార్ భరత్ యాదగిరిరావు రాఘవేంద్ర చారి .హర్ష. శ్రీకాంత్ అభిషేక్ రమాకాంత్ విట్టల్ రావు రాదేశం, జగదీష్ శర్మ, కమల్ కిషోర్ శర్మ పాల్గొన్నారు.

Previous పేదింటి అడబిడ్డలకు పెళ్లి కనుక సంతోషాన్నిస్తుంది : షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
Next పోలీస్ సేవలపై ప్రజల అభిప్రాయం
ADVERTISEMENT