జిల్లేడు చౌదరిగుడా మండల 63 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ..
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: పేదింటి ఆడబిడ్డ కూతురు పెళ్లి చేసి ప్రభుత్వం నుంచి పారితోషికం అందుకుంటే ఆ సంతోషం ఎంతో గొప్పగా ఉంటుందని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. గురువారం జిల్లేడు చౌదరిగూడెం మండల పరిధిలోని 63 మంది లబ్ధిదారులకు కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చలివేంద్రం పల్లి రాజు ఆధ్వర్యంలో షాద్ నగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద తల్లి బిడ్డ పెళ్లి చేసినప్పుడు ఎన్నో కష్టాలు పడి ఉంటుందని, వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వారికి ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం ఎన్నో రకాలుగా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ వస్తుందని, రానున్న కాలంలో ఆడపిల్లల కోసం మరిన్ని సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. పెళ్లి కానుగల్ అందుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆయన సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా క్యాంప్ కార్యాలయానికి హాజరైన లబ్ధిదారులు మెలకు కృతజ్ఞతలు తెలిపారు అనంతరం ఏర్పాటు చేసిన భోజన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ జగదీశ్వర్, శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ ఖాన్, మహమ్మద్ ఇబ్రహీం, కొందరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, జిల్లేడు చౌదరి గూడెం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆంజనేయులు, చంద్రశేఖర్, సత్యనారాయణ రెడ్డి, ఎజాస్ అలీ, సలీం, బాలరాజ్, గోపాల్, శివమౌళి, పాలమూరు యాదయ్య, పిట్ట రజిత, యాదగిరి గౌడ్, లింగం గౌడ్, భాస్కర్, గోబ్రియానాయక్, బోయ రామచంద్రయ్య, జగన్మోహన్ రెడ్డి, జక్కని రవి, సురేందర్, వెంకట్ రాములు, అశోక్, తోపాటు లబ్ధిదారులు మండలవాసులు పాల్గొన్నారు.