| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

పాడుబడిన ఇంట్లోని ఫ్రిడ్జ్‌లో మనిషి పుర్రె - ఎముకలు... ఎలా?

పాడుబడిన ఇంట్లోని ఫ్రిడ్జ్‌లో మనిషి పుర్రె - ఎముకలు... ఎలా?

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: కేరళ రాష్ట్రంలో ఓ భయానక ఘటన ఒకటి వెలుగు చూసింది. ఓ పాడుబడిన ఇంట్లోని ఫ్రిడ్జ్‌లో మనిషి పుర్రె - ఎముకలు లభ్యమయ్యాయని, అధికారులు తెలిపారు. చొట్టనిక్కర పోలీస్ స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన వెలుగు చూసింది. ఆ ప్రాంతంలోని ఓ పాడుబడిన ఇంటిని అసాంఘిక శక్తులు వినియోగిస్తున్నాయని అక్కడి పంచాయతీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ ఇంట్లో సోదాలు నిర్వహించేందుకు వెళ్లిన పోలీసులు ఖంగుతిన్నారు. ఆ ఇంట్లోని ప్రిడ్జిలో మనిషి పుర్రె, ఎముకలు కనిపించాయి. అయితే, అవి చాలాయేళ్ల కిందటివిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ ఎముకలు ఎవరివి, ఎలా వచ్చాయి అనే దానిపై స్పష్టత రావాల్సివచ్చింది. వాటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించినట్టు అధికారులు తెలిపారు.  మరోవైపు, ఆ ఇల్లు ఎర్నాకుళం స్థానికుడిగా గుర్తించారు. దాదాపు 15 - 20 యేళ్ల నుంచి ఆ ఇంట్లో ఎవరూ ఉండటం లేదని తెలిపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపడంతో చర్చనీయాంశంగా మారింది. 

Previous కేశంపేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, షాద్ నగర్ సి.హెచ్.సి ఆసుపత్రికి అదనపు నిధులు మంజూరు చేయాలి
Next నిబంధనలు సరిగ్గా పాటించడం లేదని వేములవాడ పట్టణంలోని చాణక్య నర్సింగ్ హోమ్ సీజ్
ADVERTISEMENT