| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలోనే 15 ఏళ్ల బాలికపై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారం

ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలోనే 15 ఏళ్ల బాలికపై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారం

డైలీ భారత్, జోధ్ పూర్: జోధ్ పూర్ లోని ప్రభుత్వ మహాత్మాగాంధీ ఆసుపత్రి ఆవరణలోనే 15 ఏళ్ల బాలికపై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

ఆదివారం రాత్రి ఈ ఘటన జరగ్గా సోమవారం సాయంత్రం పోలీసులకు సమాచారం అందించారు. ప్రతాప్ నగర్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ అనిల్ కుమార్ ఈ ఘటన పూర్వాపరాలను వివరించారు.

తల్లి మందలించడంతో ఆ 15 సంవత్సరాల బాలిక ఆదివారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆమె కోసం కుటుంబ సభ్యులు వెతికినా ఆచూకీ లభించకపోవడంతో సోమవారం సూరాసాగర్ పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఆస్పత్రి ఆవరణలో బాలిక ఒంటరిగా ఉండటాన్ని గమనించిన ఇద్దరు వ్యక్తులు ఆమె వద్దకు వెళ్లారు. అనంతరం, ఆ బాలికకు మాయమాటలు చెప్పి ఆస్పత్రి బయోమెడికల్ వేస్ట్ డంప్ యార్డు వెనుక ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

సోమవారం సాయంత్రం ఆస్పత్రి సమీపంలో బాధితురాలిని గుర్తించిన పోలీసులు ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనంతరం బాలిక తన తల్లిదండ్రులకు, పోలీసులకు దాడికి సంబంధించిన వివరాలను వెల్లడించింది. ఆ బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం దర్యాప్తు ప్రారంభించినట్లు కుమార్ తెలిపారు. మంగళవారం ఉదయం ఆసుపత్రి ఆవరణలో నేరం జరిగిన ప్రాంతం నుంచి ఫోరెన్సిక్ బృందం ఆధారాలు సేకరించిందని, అనుమానితులను పట్టుకునేందుకు బృందాలను ఏర్పాటు చేశామని, వారి ఆచూకీ ప్రాథమికంగా నిర్ధారణ అయిందని తెలిపారు. పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తామని అన్నారు

Previous కేజ్రీవాల్‌కు దక్కని ఊరట...సెప్టెంబర్ 3 వరకూ జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు
Next మానవత్వం చాటుకున్న మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు
ADVERTISEMENT