| Daily భారత్
Logo




సైబర్ నేరాల, సైబర్ భద్రత పై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలి.

News

Posted on 2023-11-01 12:49:21

Share: Share


సైబర్ నేరాల, సైబర్ భద్రత పై ప్రతి ఒక్కరికి  అవగాహన కలిగి ఉండాలి.

సైబర్ నేరాలు, సైబర్ భద్రత పై అవగాహన గురించి ప్రతి నెల మొదటి బుధవారం రోజున సైబర్ జాగౄక్త దివాస్ అనే ప్రత్యేక కార్యక్రమం

డైలీ భారత్ రాజన్న సిరిసిల్ల :జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ఆదేశాలమేరకు  సైబర్ నేరాలు పై అవగాహన గురించి ప్రతి నెల మొదటి బుధవారం రోజున సైబర్ జాగౄక్త  దివాస్ అనే ప్రత్యేక కార్యక్రమం జిల్లా లోని అన్ని పోలీస్ స్టేషన్లో పరిధిలో వివిధ  పాఠశాలల్లో ఉన్న విద్యార్థులకు, యువతకు, ప్రజలకు  సైబర్ భద్రత, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.

సైబర్ జాగౄక్త  దివాస్ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు జిల్లా  సైబర్ సెల్ డిఎస్పీ ఆధ్వర్యంలో పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలలో మరియు అన్ని పోలీస్ స్టేషన్స్ పరిధిలో సైబర్ క్రైమ్ మీద విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది.

సైబర్ నేరాలపై అవగాహన కల్పించి , సైబర్ నేరాలను నివారించడమే జిల్లా పోలీసుల లక్ష్యంగా విద్యార్థులకు, యువతకు, ప్రజలకు  సైబర్ క్రైంపై అవగాహన కల్పించడంలో భాగంగా రాష్ట్ర పోలీస్ ఆద్వర్యంలో  సైబర్ జాగౄక్త  దివస్ అనే కార్యక్రమం ద్వారా సైబర్ భద్రత తో పాటు  సైబర్ నేరాలపై అవగాహన , నివారణకు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ప్రస్తుత కాలంలో వాట్స్అప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ను పిల్లలు ఎక్కువ వాడుతున్నారు కాబట్టి వాటిని వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తల్లిదండ్రులు పిల్లలకు సూచించాలి.ఈ యెక్క కార్యక్రమ0 లో నేర్చుకున్న విషయాల్ని  ప్రతి ఒక్కరు మిగతా వారికి అవగాహన కల్పించాల్సి ఉంటుందని అన్నారు . ఉపాధ్యాయులు సైతం సైబర్ నేరాల నియంత్రణలో తమవంతు పాత్ర పోషించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో  అందరికీ అవగాహన తప్పనిసరి అన్నారు.

Image 1

FASTag : హైవే ప్రయాణికులకు షాక్..ఏప్రిల్ 1 నుంచి ఫాస్టాగ్ ధరలు పెంపు

Posted On 2026-04-01 07:56:39

Readmore >
Image 1

మానవత్వం చాటుకున్న పోలీస్ శాఖ

Posted On 2026-04-01 07:19:43

Readmore >
Image 1

పిల్లల పుట్టు వెంట్రుకల విసర్జన

Posted On 2026-04-01 06:57:19

Readmore >
Image 1

ప్రభుత్వ డిగ్రీ కళాశాల - ఆంగ్ల విభాగం ఆధ్వర్యంలో "కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ " పై సర్టిఫికెట్ కోర్స్ ముగింపు సమావేశం

Posted On 2026-04-01 05:45:44

Readmore >
Image 1

జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు

Posted On 2026-03-31 17:12:42

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన తహశీల్దార్

Posted On 2026-03-31 12:21:45

Readmore >
Image 1

సీజ్ చేసిన టపాసులు ప్రమాదవశాత్తు పేలాయి

Posted On 2026-03-31 11:42:14

Readmore >
Image 1

మహిళలు ఆకాశమే హద్దుగా ముందుకు వెళ్ళాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-03-31 11:28:48

Readmore >
Image 1

పోలీస్ స్టేషన్లో అగ్నిప్రమాదం

Posted On 2026-03-31 11:12:33

Readmore >
Image 1

గంజి శ్రీదేవి శ్రీనివాస్ వివాహ వార్షికోత్సవం సందర్భంగా అన్నప్రసాద కార్యక్రమం

Posted On 2026-03-31 10:55:55

Readmore >