Posted on 2023-11-01 06:43:59
డైలీ భారత్, హైదరాబాద్: ఎన్నికలు గడువు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లను కేంద్ర ఎన్నికల సంఘం సమీక్షించనుంది. ఇందుకు ఈసీ బృందం నేడు తెలంగాణకు రానుంది..
సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు సతీశ్ వ్యాస్, ధర్మేంద్ర శర్మతో కూడిన బృందం రెండ్రోజుల పాటు హైదరాబాద్ లో పర్యటించనుంది.
ఈసీ బృందం…రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్, అధికారులతో సమావేశం కానుంది. ఎన్నికల ఏర్పాట్లపై ఆరా తీయనుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ సహా ఇతర అధికారులతో కూడా సమావేశం కానున్నారు.
అనంతరం ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల అధికారులతో సమావేశం కానుంది. తనిఖీలు, స్వాధీనాలపై సమీక్ష నిర్వహించనుంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పొరుగు రాష్ట్రాల సీఎస్. డీజీపీల, అధికారులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు.
ఎన్నికలు సజావుగా సాగేందుకు తీసుకోవాల్సిన చర్యలు, సరిహద్దుల్లో చెక్ పోస్టులు, తనిఖీలు తదితర అంశాలపైచర్చిస్తారు
పొద్దుతిరుగుడు సేకరణకు అన్ని ఏర్పాట్లు : కలెక్టర్ గరిమ అగ్రవాల్.
Posted On 2026-04-01 17:10:33
Readmore >
ఏసీబీకి చిక్కిన ఉస్మానియా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, పే-బిల్ సెక్షన్ అధికారులు
Posted On 2026-04-01 15:43:24
Readmore >
ప్రపంచంలోనే మొట్ట మొదటి స్పోర్ట్స్ హ్యాకథన్ క్రీడాల్లో విజయం సాధించిన కామారెడ్డి జిల్లా క్రీడా కారులను అభినందించిన జిల్లా కలెక్టర్
Posted On 2026-04-01 14:26:38
Readmore >
ఏఎస్పీ, కామారెడ్డి కార్యాలయంలో నూతన ఛాంబర్‌ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ
Posted On 2026-04-01 13:21:20
Readmore >
వేసవి వడగాలుల నష్టాల నియంత్రణకు చర్యలు : కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-04-01 12:55:54
Readmore >