| Daily భారత్
Logo




సిరిసిల్ల పట్టణంలో రేపటి నుండి ప్రచారం ప్రారంభించనున్న బిఆర్ఎస్ పట్టణ శాఖ

News

Posted on 2023-10-31 13:28:54

Share: Share


సిరిసిల్ల పట్టణంలో రేపటి నుండి ప్రచారం ప్రారంభించనున్న బిఆర్ఎస్ పట్టణ శాఖ

డైలీ భారత్, సిరిసిల్ల : ఈరోజు రాజన్న సిరిసిల్ల తెలంగాణ భవన్ లో బిఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల శాఖ అధ్యక్షులు జిందం చక్రపాణి  అధ్యక్షతన సిరిసిల్ల నియోజకవర్గ శాసనసభ ఎన్నికల ప్రచార సన్నాహక సమావేశంను నిర్వహించారు....

సందర్భంగా వారు మాట్లాడుతూ పరాయి పాలకుల చెంత నుండి తెలంగాణ ప్రాంతాన్ని విముక్తి చేసి స్వరాష్ట్రంలో స్వపరిపాలనలో ప్రజా సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి ద్యేయంగా పరిపాలన సాగిస్తున్న  ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదర్శవంతమైన పాలన దక్షత ను గురించి అదేవిధంగా సిరిసిల్ల ప్రాంతంను గతంలో ఎన్నడు కనివిని ఎరగని రీతిలో అభివృద్ధి చేసి అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందేలా చూస్తూ పారదర్శకంగా ప్రభుత్వ సేవలను గడప గడపకు అందిస్తున్న  మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు ఈ శాసనసభ ఎన్నికల్లో మరోసారి బారి మెజారిటీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని గుర్తు చేస్తూ ప్రజల్ని చైతన్యవంతులను చేసేలా రేపు ఉదయం 9 గంటలకు స్థానిక శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి గడప గడపకు బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని చేపట్టి సిరిసిల్ల పురపాలక సంఘ పరిధిలోని అన్ని వార్డులలో  సిరిసిల్ల నియోజకవర్గ శాసనసభ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తామని అన్నారు..

అదేవిధంగా అన్ని వార్డులలో ప్రతిరోజు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూనే  పార్టీ ముఖ్య నాయకులు కౌన్సిలర్ సభ్యులు ఇతర ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులతో కలిసి ప్రతిరోజు 4 వార్డులలో విస్తృత స్థాయిలో ఎన్నికల ప్రచారం కూడ నిర్వహిస్తామని అన్నారు..

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు చీటీ నర్సింగరావు, రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్ , జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, పురపాలక సంఘ అధ్యక్షురాలు శ్రీమతి జిందం కళ చక్రపాణి, జిల్లా గ్రంధాలయ సంస్థ అధ్యక్షులు ఆకునూరి శంకరయ్య , జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్య , మున్సిపల్ వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్,  మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు అగ్గి రాములు, సెస్ డైరెక్టర్ దార్నం లక్ష్మీనారాయణ, కౌన్సిలర్ సభ్యులు మరియు కోఆప్షన్ సభ్యులు మాజీ ప్రజా ప్రతినిధులు బిఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల శాఖ కార్యవర్గ సభ్యులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు, వార్డు శాఖల అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Image 1

రాజ్‌భవన్‌లో స్వాతంత్ర్య వేడుకలకు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడికి అరుదైన ఆహ్వానం

Posted On 2026-08-15 18:03:53

Readmore >
Image 1

ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు

Posted On 2026-08-15 17:53:10

Readmore >
Image 1

16 సంవత్సరాల సేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న KRK Sunshine Charitable Trust

Posted On 2026-08-15 17:50:48

Readmore >
Image 1

గ్రామీణ విద్యలో మార్పు... సాంకేత్ సంస్థ ద్వారా సోమారం స్కూల్‌కు డిజిటల్ పరికరాలు

Posted On 2026-08-15 17:49:14

Readmore >
Image 1

సాయి ఎక్సలెంట్ పాఠశాలలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Posted On 2026-08-15 16:56:59

Readmore >
Image 1

విద్యుత్ షాక్ తో మరణించిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మృతికి కారణమైన నిందితులను అరెస్టు చేసిన బూర్గంపాడు పోలీసులు

Posted On 2026-08-15 16:55:47

Readmore >
Image 1

మూడు ప్రాంతాల్లో ఫ్రీజర్‌ బాక్సుల పంపిణీ

Posted On 2026-08-15 16:54:31

Readmore >
Image 1

స్వాతంత్ర్య స్ఫూర్తితో దేశాభివృద్ధికి కృషి చేయాలి

Posted On 2026-08-15 16:53:32

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా : జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Posted On 2026-08-15 13:43:20

Readmore >
Image 1

వెంకట సాయి నగర్ కాలనీలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Posted On 2026-08-15 07:51:52

Readmore >