| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

గంభీరావుపేట జూనియర్ అసిస్టెంట్, బిల్ కలెక్టర్ సస్పెండ్ : పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య

గంభీరావుపేట జూనియర్ అసిస్టెంట్, బిల్ కలెక్టర్ సస్పెండ్ : పంచాయతీ అధికారి  వీర బుచ్చయ్య

డైలీ భారత్, గంభీరావుపేట: గంభీరావుపేట జూనియర్ అసిస్టెంట్, బిల్ కలెక్టర్ ను సస్పెండ్ చేస్తూ జిల్లా పంచాయతీ అధికారి  వీర బుచ్చయ్య బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. గంభీరావుపేట మేజర్ గ్రామపంచాయతీలో జూనియర్ అసిస్టెంట్ శిరీష గ్రామంలో వసూలు చేసిన ఇంటి పన్ను రూ. 12,93,921 ట్రెజరీ లో జమ చేయకుండా  దుర్వినియోగానికి పాల్పడడం విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారు. అలాగే బిల్ కలెక్టర్ శ్రీ హరి గ్రామంలో వసూలు చేసిన ఇంటి పన్ను రూ. 2,40,100 ట్రెజరీ లో జమ చేయకుండా దుర్వినియోగానికి పాల్పడడం విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వహించడంతో మండల పంచాయతీ అధికారి విచారణ నివేదిక ప్రకారం జూనియర్ అసిస్టెంట్ , బిల్ కలెక్టర్ ను సస్పెండ్ చేస్తూ జిల్లా పంచాయతీ అధికారి ఉత్తర్వులు జారీ చేశారు.

Previous రీల్స్ మోజులో ఉరేసుకుని ప్రాణాలు కోల్పోయిన యువకుడు
Next KTR కీలక వ్యాఖ్యలు
ADVERTISEMENT