ఇల్లంతకుంట స్పోర్ట్స్ క్లబ్ వారికి అభినందనలు
యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు అంతగిరి వినయ్ కుమార్
డైలీ భారత్, ఇల్లంతకుంట: ఇల్లంతకుంట మండల కేంద్రంలో స్పోర్ట్స్ క్లబ్ వారు నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరన్ని సందర్శించి క్రిడాకారులకు పండ్లను అందజేసిన యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు అంతగిరి వినయ్ కుమార్ యువత చెడు మార్గం వైపు వెళ్లకుండా క్రికెట్, కబడ్డీ లాంటి ఆటలు నేర్పిస్తున్న స్పోర్ట్స్ క్లబ్ వారికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఎర్రోజు సంతోష్, నిర్వహకులు శివరాం, కీసరి బాబు, మామిడి శ్రీను,మోజెష్, జనార్ధన్, వెంకటేష్, నవీన్, నిఖిల్, ముకేశ్,క్రిడాకారులు పాల్గొన్నారు.