| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

భద్రాచలం సీతమ్మ తల్లికి రంగులు మార్చే బంగారు చీర

భద్రాచలం సీతమ్మ తల్లికి రంగులు మార్చే బంగారు చీర

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల:తన తండ్రి నల్ల పరందా ములు నెలకొల్పిన వారస త్వాన్ని పుణికిపుచ్చుకొని, అదే దిశలో చేనేత మగ్గంపై పలు ప్రయోగాలు చేస్తూ, తండ్రికి దగ్గర తనయుడు అనిపించుకున్నారు. నల్ల పరందాములు..

సిరిసిల్లలో అగ్గిపెటెల్లో చీరను నేసి ఘనతను సాధించిన చేనేత కాళా కారుడిగా గుర్తింపు తెచ్చు కున్నారు. అతని కుమా రుడు నల్ల విజయ్ ఇఫ్పుడు భద్రాద్రి రాములోరికి.. బంగారు చీరను నేసి.. మరింత ఖ్యాతి సంపాదిం చారు.

తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న నల్ల విజయ్ అగ్గిపెట్టెల్లో, దబ్బనంలో పట్టే చీరలను నేసి.. సిరిసిల్ల ఖ్యాతిని మరింత పెంచారు. కుట్టు లేని కుర్తా, పైజామా ను, అరటి నారతో విభిన్న మైన వస్త్రాలను నేసి చేనేత కళా రత్న అవార్డును సైతం అందుకున్నారు.

రాజన్నసిరిసిల్ల పట్టణానికి చెందిన నేత కార్మికుడు నల్ల విజయ్ భద్రాచల రామ య్యకు వినూత్నముగా నేసిన చీరను బహుకరిం చేందుకు సిద్దమయ్యాడు. నల్ల విజయ్ చేనేత మగ్గం పై భద్రాచల రామయ్యకు రంగులు మార్చే బంగారు చీరను నేసి పలువురితో అభినందనలు అందుకు న్నారు.

Previous అక్రమంగా తలరిస్తున్న పిడియస్ రైస్ పట్టివేత : జిల్లాఎస్.పి..డా.బి.బాలస్వామి
Next బాల రాముడి నుదుట సూర్య తిలకం
ADVERTISEMENT