జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్
అనుమానాస్పద లావాదేవీలను బ్యాంకర్లు గుర్తించాలన్నారు, ఎన్నికల అధికారి, కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్
డైలీ భారత్, మహబూబాబాద్: మంగళవారం నాడు, కలెక్టర్ కార్యాలయ మినీ సమావేశ మందిరంలో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ జిల్లాస్థాయిలో బ్యాంకర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యాభై వేల నుంచి పది లక్షల మధ్య డబ్బుల లావాదేవీలు జరిగితే కచ్చితంగా రసీదు ఉండాలని పేర్కొన్నారు. 10,లక్షల పైన లావాదేవీలు ఉంటే ఆదాయ పన్ను శాఖ పరిధిలోకి వెళ్తుందని చెప్పారు. జిల్లాలో ఏటీఎంల్లో డబ్బులు నింపేందుకు వచ్చే సెక్యూరిటీ వ్యాన్ లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అన్నారు. ఏజెన్సీలు పెద్ద మొత్తంలో డబ్బులు తరలించాలంటే తెలంగాణ సీఈఓ నుంచి అనుమతి తప్పనిసరిగా పొందాలని అన్నారు. లాకర్స్ లో గోల్డ్ ను పర్యవేక్షించి, క్యాష్ జెనరేట్ చేయడానికి క్యూఆర్ కోడ్ ను ఉపయోగించాలని, వెహికిల్ నంబర్ లను తనిఖీ చేయాలని వివరించారు. అలాగే ప్రతి రోజూ క్యాష్ డిపాజిట్ వివరాలను నమోదు చేయాలని ఆదేశించారు.
అంతకుముందు కలెక్టరేట్ ప్రధాన సమావేశం మందిరంలో డిప్యూటీ ఎన్నికల అధికారి, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) లెనిన్ వత్సల్ టోప్పో, డేవిడ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులతో లతో జిల్లా ఎన్నికల అధికారి, అద్వైత్ కుమార్ సింగ్ పోస్టల్ బ్యాలెట్, హోం ఓటింగ్, ఎన్నికల విధులలో వివిధ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ల ప్రాముఖ్యత తదితర అంశాలపై మాస్టర్ ట్రైనర్ రాము, తో శిక్షణ తరగతులు నిర్వహించారు,
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డేవిడ్, అడిషనల్ ఎస్పీ చెన్నయ్య, ఎల్డీఎం ఆర్. సత్యనారాయణ మూర్తి , బ్యాంకర్లు, ఎలక్షన్ సూపర్డెంట్ పవన్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.