డైలీ భారత్, మహబూబాబాద్: పదవ తరగతి పరీక్షలు నిర్వహిస్తున్న పరీక్షా కేంద్రాలను మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మంటిసేరి హై స్కూల్, మరియు చైతన్య టెక్ స్కూల్ లో పరీక్ష కేంద్రం వద్ద పోలీస్ బందోబస్తుతో పాటు పరీక్షలు సజావుగా జరిగేందుకు అధికారులు తీసుకుంటున్న చర్యలపై ఎస్పీ పర్యవేక్షంచారు. పరీక్షలను పురస్కరించుకొని పరీక్షలు జరుగుతున్న పరీక్షా కేంద్రాల పరిసరాలపై పోలీసులతో పాటు, ఇన్విజిలెటర్లు దృష్టి పెట్టాలని, సెక్షన్ 144 అమలు లో ఉన్నందున పరీక్షా కేంద్రాల పరిసరాల్లో ప్రజలు గుంపులు ఉండకుండా జాగ్రత్త పడాలని అలాగే అనుమతులు లేకుండా సభలు సమావేశాలు నిర్వహించడం చేయరాదని, ముఖ్యం పరీక్షలు జరుగుతున్న సమయంలో పరీక్షా కేంద్రాల పరిసరాలను నో సెల్ ఫోన్ జోన్ గా పరిగణలోనికి తీసుకుపోవడంతో పాటు పరీక్షా కేంద్రం పరిసరాల్లో జిరాక్స్ సెంటర్లను మూసి వేయాలని, ముఖ్యంగా సిసి కెమెరాల పనితీరుపై సంబందిత పరీక్షా కేంద్రం అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేశించాలని ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS తెలిపారు.
News
పదవ తరగతి పరీక్షా కేంద్రాలను సందర్శించిన ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS