డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా: కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ కోరడంపై పరిగి కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి స్పందించారు. గాంధీభవన్‌లో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ తీరు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు.10 ఏళ్ళ పాటు విచ్చల విడిగా ఫిరాయింపులను ప్రోత్సహించింది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్, టీడీపీ, బీఎస్పీ చివరకు సీపీఐ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి మీ పార్టీలో చేర్చుకోలేదా అని నిలదీశారు. తెలంగాణ పునర్ నిర్మాణం పేరుతో శాసనసభ్యులను చేర్చుకున్నది మీరు కాదా కడిగిపారేశారు. పదేళ్లలో ఇతర పార్టీల నుంచి మొత్తం 39 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యే లను బీఆర్ఎస్ చేర్చుకుందని గుర్తు చేశారు.
2014లో 23 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు.. ఇందులో టీడీపీ నుంచి 12 మంది, కాంగ్రెస్ నుంచి 5 గురు, వైసీపీ నుంచి ముగ్గురు, బీఎస్సీ నుంచి ఇద్దరు, సీపీఐ నుంచి ఒకరిని చేర్చుకున్నారని అన్నారు. 2018లో 16 మందిని చేర్చుకోలేదా..? కాంగ్రెస్ నుంచి 12 మంది, తెలుగుదేశం నుంచి ఇద్దరు, ఇండిపెండెంట్లు ఇద్దరిని చేర్చుకున్నారని గుర్తు చేశారు. కేటీఆర్, హరీష్ రావు ప్రతిపక్ష ఎమ్మెల్యేల ఇళ్ల చుట్టూ తిరిగి ప్రలోభపెట్టింది మరిచిపోయారా అని ఎద్దేవా చేశారు. టీడీపీ నుంచి మీ పార్టీలో చేరిన ఎమ్మెల్యే తలసానితో రాజీనామా చేయించకుండా మంత్రి వర్గంలోకి తీసుకోలేదా..? కాంగ్రెస్‌లో గెలిచిన సబితా ఇంద్రారెడ్డిని మీ మంత్రివర్గంలోకి తీసుకోలేదా..? అప్పటి స్పీకర్లు మధుసూదనాచారి, పోచారం శ్రీనివాస్ రెడ్డి అనర్హత పిటిషన్లలపైన చర్యలు తీసుకున్నారా అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ఇచ్చిన ఫిర్యాదులపైన కనీసం ఒక్క సారి కూడా విచారణ కూడా చేయలేదని మండిపడ్డారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను చేర్చుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడూ భావించలేదు.. 100 రోజుల పాటు మేం ఆ ఆలోచన కూడా చేయలేదని స్పష్టం చేశారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు గౌరవం ఇచ్చి.. ముఖ్యమంత్రి వారికి అపాయింట్ మెంట్ ఇచ్చి సమస్యలు తెలుసుకున్నారని చెప్పారు.కానీ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీఆర్ఎస్, బీజేపీ కుట్రలు చేశాయి.. ప్రమాణస్వీకారానికి ముందే కడియం శ్రీహరి ప్రభుత్వం కూలి పోతుందన్నారు.. త్వరలో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని కేటీఆర్ అనలేదా అని ప్రశ్నించారు. మన ప్రభుత్వం ఆరు నెలల్లో వస్తుందని కేసీఆర్ ఎమ్మెల్యేల సమావేశంలో చెప్పలేదా అని నిలదీశారు. బీఆర్ఎస్, బీజేపీ కలిసి మా ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కుట్రలు చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా..? మీ కుట్రలకు బలి కావడానికి రేవంత్ రెడ్డి చేతకాని వాడు కాదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. దెబ్బకు దెబ్బ తీస్తామని.. మా ప్రభుత్వాన్ని ఐదేళ్లు ఎలా కొనసాగించాలో మాకు తెలుసని కీలక వ్యాఖ్యలు చేశారు.