| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఆ..వందకోట్లు..ఎక్కడివి..

ఆ..వందకోట్లు..ఎక్కడివి..

డైలీ భారత్, ఢిల్లీ:ఢిల్లీ మనీ లాండరింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తొలి రోజు ఈడీ కస్టడీ ముగింది. కోర్టు ఆదేశాల మేరకు అధికారులు కవిత విచారణ మొత్తాన్ని వీడియో తీశారు. ఇక, దర్యాప్తు సందర్భంగా ఎమ్మెల్సీ కవితపై ఈడీ ఇన్వెస్టిగేషన్ అధికారుల బృందం ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం. ఢిల్లీ మద్యం పాలసీలో టెండర్ల కోసం ఆప్ ప్రభుత్వానికి ఇచ్చిన రూ.100 కోట్ల ముడుపులు ఎక్కడి నుండి వచ్చాయి.. ఆ డబ్బు ఎవరెవరు సమకూర్చారని ఈడీ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. రూ.100 కోట్లకు సంబంధించిన లావీదేవీల వివరాలను ముందు పెట్టి కవితను క్వశ్చన్ చేశారని సమాచారం. లిక్కర్ స్కామ్ ద్వారా సంపాదించిన రూ.192 కోట్ల రూపాయలు ఏం చేశారని.. ఆ డబ్బులు ఇంకా ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేశారని నిలదీసినట్లు తెలుస్తోంది. ఆమె కొనుగోలు చేసిన ఆస్తి పత్రాలు చూపించి ఈడీ ప్రశ్నల వర్షం కురిపించగా.. అధికారుల ప్రశ్నల్లో కవిత కొన్నింటికి సమాధానాలు ఇచ్చి.. మరికొన్నింటికి సైలెంట్‌గా ఉన్నట్లు టాక్. ఇక, తొలి రోజు కస్టడీ అనంతరం కవితను కేటీఆర్, హరీష్ రావు, ఆమె భర్త అనిల్ కుమార్ కలిశారు. అనంతరం తన అరెస్ట్‌ను సవాల్ చేస్తూ రేపు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని కవిత నిర్ణయం తీసుకున్నారు.

Previous ఇక నా రాజకీయం ఎలా ఉంటుందో చూపిస్తా: రేవంత్ రెడ్డి
Next పార్లమెంటు ఎన్నికల ప్రక్రియ (కోడ్)ముగిసే వరకు : ప్రజావాణి కార్యక్రమం రద్దు
ADVERTISEMENT