| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ: లోక్ సభ ఎన్నికల షెడ్యూల్

అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ: లోక్ సభ ఎన్నికల షెడ్యూల్

డైలీ భారత్, న్యూ ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ అరుణాచల్‌ ప్రదేశ్‌, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకే దశలోనూ, ఒడిశా రాష్ట్రా నికి నాలుగు దశల్లో ఎన్ని కలు జరుగ నున్నాయి. అరుణాచల్‌ ప్రదేశ్‌, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీలకు లోక్‌సభ తొలి దశ ఎన్నికలతోపాటు ఏప్రిల్‌ 19న పోలింగ్‌ జరగనుంది.

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీకి లోక్‌ సభ నాలుగో దశ ఎన్నికల తోపాటు మే 13న ఒకే దశలో పోలింగ్‌ నిర్వ హించనున్నారు. ఒరిస్సా రాష్ట్ర అసెంబ్లీకి లోక్‌సభ నాలుగు, ఐదు, ఆరు, ఏడు దశల ఎన్నికలతోపాటు నాలుగు దశల్లో మే 13, మే 20, మే 25, జూన్‌ 1న పోలింగ్‌ జరుగనుంది.

175 స్థానాలున్న ఆంధ్ర ప్రదేశ్‌ అసెంబ్లీ కాలపరిమితి జూన్‌ 11న ముగియనుంది. 175 స్థానాల్లో 139 జనరల్‌ కేటగిరీ, 29 ఎస్‌సి, 7 ఎస్‌టి రిజర్వ్‌ స్థానాలు ఉన్నాయి. అలాగే 25 లోక్‌సభ స్థానా లకు 20 జనరల్‌ కేటగిరీ, 4 ఎస్‌సి, 1 ఎస్‌టి రిజర్వ్‌ స్థానాలు ఉన్నాయి.

తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు 17 జనరల్‌ కేటగిరీ, 3 ఎస్‌సి, 2 ఎస్‌టి రిజర్వ్‌ స్థానాలు ఉన్నాయి. నాలుగో దశలో ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ, తెలంగాణ లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. రెండు రాష్ట్రాల్లో మే 13న పోలింగ్‌ జరగనుంది.

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ కు ఎన్నిక

దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో 26 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక జరగనుంది. ఈ మేరకు సార్వత్రిక ఎన్ని కలతో పాటే ఉప ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఏడు విడతల్లో ఆయా రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరుగుతాయి.

తెలంగాణ కంటోన్మెంట్‌ స్థానానికి నాలుగో విడతలో మే 13న ఎన్నిక జరగ నుంది. ఇక్కడ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఈ స్థానం ఖాళీ అయిన విషయం తెలిసిందే.

మొత్తం ఓటర్లు 96.8 కోట్లు

– పురుషులు 49.7 కోట్లు 8 మహిళలు 47.1 కోట్లు

– ట్రాన్స్‌ జండర్స్‌ 48,044

– 18-19 ఏండ్ల వయస్సుండి తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునే యువత 1.85 కోట్లు.

– 20-29 మధ్య వయస్సు గల ఓటర్లు 19.74 కోట్లు

– 85 ఏండ్లు పైబడిన వృద్ధులు 81,87,9999 మంది

– వందేండ్లు పైబడిన వృద్ధులు 2,18,442 మంది

– వికలాంగులు 88,35,449 మంది.

– అందులో 52,65,076 మంది పురుషులు, 8 35,69,933 మంది మహిళలు, 440 ట్రాన్స్‌ జండర్స్‌ ఉన్నారు..

ఈవీఎంలు : 55 లక్షలు

పోలింగ్‌ కేంద్రాలు :10.5 లక్షలుపోలింగ్‌

అధికారులు,భద్రతా సిబ్బంది :1.5 కోట్లు

ఎన్నికల షెడ్యూల్‌- ఎన్నికల ప్రక్రియ తేదీ

నోటిఫికేషన్‌ : ఏప్రిల్‌ 18 గురువారం

నామినేషన్ల గడువు : ఏప్రిల్‌ 25 గురువారం

నామినేషన్ల పరిశీలన : ఏప్రిల్‌ 26 శుక్రవారం

ఉపసంహరణ : ఏప్రిల్‌ 29 సోమవారం

పోలింగ్‌ : మే 13 సోమవారం

ఓట్ల లెక్కింపు : జూన్‌ 4 మంగళవారం

Previous 37 కార్పొరేష‌న్ల‌కు ఛైర్మ‌న్‌ల‌ను నియ‌మించిన: రేవంత్ రెడ్డి సర్కార్
Next బిఆర్ఎస్ పార్టీకి మరో బిగ్‌ షాక్‌.. ఎంపీ రంజిత్‌రెడ్డి రాజీనామా
ADVERTISEMENT