డైలీ భారత్, జగిత్యాల జిల్లా: జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ వద్ద జగిత్యాల,నిజామాబాద్ ప్రధాన రహదారిపై ఆదివారం తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం జరిగింది.
ఆగి ఉన్న లారీని ద్విచక్ర వాహనం అతివేగంగా డీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.
వీరు కొండగట్టుకు చెందిన వారిగా గుర్తించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు