మల్కాజిగిరిలో ప్రధాని మోదీ రోడ్ షో:పోటెత్తిన బీజేపీ కార్యకర్తల సందోహం
డైలీ భారత్, హైదరాబాద్:దక్షిణాదిలో బీజేపీ అత్య ధికంగా ఆశలు పెట్టుకున్న తెలంగాణలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఎన్నికల ప్రచారం ప్రారంభిం చారు. దేశంలోకెల్లా అతిపెద్ద లోక్‌సభ నియోజకవర్గమైన మల్కాజిగిరిలో పార్టీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు మద్దతుగా భారీ రోడ్‌షో నిర్వహించారు.
మీర్జాలగూడ నుంచి మల్కాజిగిరి క్రాస్‌రోడ్డు వరకు 1.3 కిలోమీటర్ల మేర అట్టహాసంగా సాగిన ఈ రోడ్ షోలో అడుగడుగునా పూల వాన కురిపిస్తూ బీజేపీ శ్రేణులు, అభిమా నులు ప్రధానికి ఘన స్వాగతం పలికారు.
మీర్జాలగూడ నుంచి పీవీ ఎన్ కాలనీ, సాయిరాం థియేటర్, వెంకటేశ్వర నగర్ మజీద్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, గాంధీ పార్క్ మీదుగా మల్కాజిగిరి చౌరస్తా వరకు రోడ్ షో సాగింది. ప్రధాని వెంట రోడ్‌షోలో ఈటల రాజేందర్‌తో పాటు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఉన్నారు.
సాయంత్రం 5.42 గంటలకు బేగంపేటలో దిగిన మోదీకి ఎంపీ లక్ష్మణ్, ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి, ఏ.వీ.రెడ్డి స్వాగతం పలికారు. రోడ్డు మార్గంలో 6.16 గంటలకు మీర్జాలగూడ వచ్చిన ప్రధా నిని చూడగానే మోదీ.. మోదీ నినాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది.
దారి పొడవునా ఏర్పాటు చేసిన 60 స్వాగత వేదికల గుండా ఓపెన్ టాప్ జీపులో అభివాదం చేస్తూ మోదీ రోడ్ షోలో ముందుకు సాగారు. మల్కాజిగిరి చౌరస్తాలో ప్రధాని మాట్లా డతారని అంతా భావిం చారు. అయితే, ఆయన ప్రసంగం లేకుండా కేవలం అభివాదం చేస్తూ వెళ్లిపోవ డంతో పార్టీ శ్రేణులు నిరు త్సాహానికి గుర య్యాయి.
సుమారు యాభై నిమిషాల పాటు సాగిన రోడ్ షోతో పరిసర ప్రాంతాలన్నీ బీజేపీ శ్రేణులతో కిక్కిరిసి పోయాయి. ప్రధాని రాక సందర్భంగా కళాకారులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీ లత, చేవెళ్ల అభ్యర్థి కొండా విశ్వేశర్‌రెడ్డి రోడ్ షోలో పాల్గొన్నారు.