| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

తెలంగాణలో నలుగురు ఐపీఎస్ అధికారుల బదిలీలు

తెలంగాణలో నలుగురు ఐపీఎస్ అధికారుల బదిలీలు

డైలీ భారత్, హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో నలుగురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు.

మహబూబాబాద్ ఎస్పీగా ఉన్న పాటిల్ సంగ్రామ్ సింగ్ గణపతిరావును డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశిం చారు. రామగుండం డీసీపీగా పనిచేస్తున్న కేకన్‌ సుధీర్‌ రామ్‌నాథ్‌ మహబూబాబాద్‌ ఎస్పీగా నియమితులయ్యారు.

గవర్నర్‌ ఏడీసీగా పనిచేస్తున్న ఆకాంక్ష యాదవ్ సెంట్రల్ జోన్ డీసీపీగా, భూపాలపల్లి ఓఎస్డీగా పనిచేస్తున్న అశోక్ కుమార్ రామగుండం డీసీపీగా బదిలీ అయ్యారు.

Previous కెసిఆర్ కు జ్ఞానం లేకనే లక్ష్మీదేవి పల్లి ఆగింది : షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
Next మార్చ్ 3,4,5 తేది లలో చిన్న పిల్లలకు పోలియో చుక్కలు
ADVERTISEMENT