| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

బెంగళూరులో పేలుళ్లు

బెంగళూరులో పేలుళ్లు

డైలీ భారత్, బెంగళూరు:బెంగళూరు పేలుళ్ల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమ య్యారు. శుక్రవారం సాయంత్రం నగరంలో హై అలర్ట్ ప్రకటించారు.

స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అప్రమత్తమై కీలక ప్రాంతా ల్లో తనిఖీలు నిర్వహిస్తు న్నట్లు నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. బెంగ ళూరు కేఫ్ పేలుడుకు గల కారణాలపై ఆరా తీస్తు న్నామని తెలిపారు.

కాగా, బెంగళూరులోని కుండలహళ్లిలోని ప్రసిద్ధ రామేశ్వరం కేఫ్‌లో శుక్రవారం మధ్యాహ్నం ఆగంతకులు టిఫిన్ బాక్స్ బాంబును పేల్చారు. ఈ ఘటనలో తొమ్మిది మందికి గాయాలయ్యాయి.

ఈ విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి సిద్ధరామ య్య ప్రకటించారు. ఐఈడీ తో దాడి జ‌రిపార‌ని.. పేలుడు ఘటన సీసీ కెమెరాల్లో రికార్డయిందని తెలిపారు.

ఘటనపై విచారణ కొనసాగుతోందని ఆయన ప్రకటించారు.

Previous నిమిషం కాదు, అయిదు నిమిషాలు లేటుగా వచ్చిన ఓకే
Next వాటర్ ట్యాంకర్ ను ఢీకొట్టిన కారు
ADVERTISEMENT