డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా బ్యూరో :పాలమూరు జిల్లాలో ఎంతో రాజకీయ అనుభవం కలిగి రాజకీయ దురంధరుడిగా పేరు సంపాదించి కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్ర ప్రజలకు ఎన్నో సేవలు అందించిన ఘనత రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి అన్నారు. శుక్రవారం ప్రతాప్ రెడ్డి చిన్నారెడ్డిని ప్రజా భవన్ లో మర్యాదపూర్వకంగా కలుసుకొని బొకే అందజేశారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులుగా చిన్నారెడ్డిని నియమించడం పట్ల ప్రతాప్ రెడ్డి ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాకుండా సమస్యలను ప్రజావాణిలో చెప్పేందుకే సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలకు అవకాశం కల్పించారని, ప్రజావాణి ఇన్‌ఛార్జ్‌గా కుడా చిన్నారెడ్డి పై సీఎం గురుతర బాధ్యత ఉంచారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 90 రోజులు పూర్తి కాకముందే నాలుగు గ్యారంటీలను అమలు చేశామని.. లోక్‌సభ ఎన్నికల కోడ్ రాకముందే మిగిలిన హామీలనూ అమలు చేస్తారని ప్రభుత్వాన్ని అభినందించారు.
”తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాడిన నిరుద్యోగ యువతను కేసీఆర్ పట్టించుకోలేదని కాళేశ్వరం, మిషన్ భగీరథ పేరుతో గత ప్రభుత్వం అవినీతికి పాల్పడిందనీ గొర్రెలు, ఆవుల పంపిణీ కార్యక్రమాల్లో సైతం టిఆర్ఎస్ నాయకులు తమ చేతివాటం ప్రదర్శించారన్నారు. కృష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్రానికి రావాల్సిన వాటా దక్కడంలేదనీ గతంలో ప్రతిపాదించి ఆచరణకు నోచుకోని ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేస్తుందని టిఆర్ఎస్ నేతలు ఏ ముఖం పెట్టుకుని కాళేశ్వరం సందర్శనకు వెళ్తున్నారనీ?గతంలో జరిగిన పనులకు సంబంధించి సుమారు రూ.40 వేల కోట్లు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. కేసీఆర్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అధ్వానంగా తయారు చేశారని. రూ.లక్ష బిల్లు చెల్లించాలంటే ఆలోచించే పరిస్థితి తలెత్తింది. ఉద్యోగ నియామకాల విషయంలోనూ భారాస ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను త్వరలోనే భర్తీ చేస్తాం అని ప్రతాప్ రెడ్డి అన్నారు.