పాలమూరు - రంగారెడ్డిలో బీఆర్ఎస్ అవినీతిని.. కేసీఆర్ అసమర్ధతను బయటపెట్టేందుకు..
పాలమూరు - రంగారెడ్డిలో బీఆర్ఎస్ అవినీతిని.. కేసీఆర్ అసమర్ధతను బయటపెట్టేందుకు..
కేసీఆర్.. పాలమూరు గడ్డ మీదే తేల్చుకుందాం రా..!!
డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా బ్యూరో : బీఆర్ఎస్ పార్టీ రేపు చలో మేడిగడ్డకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ప్రాజెక్టు వద్దే కాళేశ్వరంతో తెలంగాణ రైతాంగానికి కలిగిన లాభాన్ని వివరిస్తామని బీఆర్ఎస్ ఇప్పటికే ప్రకటించింది. అయితే బీఆర్ఎస్ చలో మేడిగడ్డ వేళ టీ-కాంగ్రెస్ సంచలన నిర్ణయం తీసుకుంది. రేపు చలో మేడిగడ్డకు పోటీగా కాంగ్రెస్ పార్టీ ‘చలో పాలమూరు-రంగారెడ్డి’ కార్యక్రమాన్ని చేపడతామని ప్రకటించింది.గాంధీ భవన్లో ఏఐసీసీ ప్రత్యేక ఆహ్వానితులు వంశీచంద్ రెడ్డి షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్ల ప్లలి శంకర్ మహబూబ్నగర్ పార్లమెంట్ ఎంఎల్ఎలు గురువారం ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చల్లా వంశీ చంద్ రెడ్డి మాట్లాడుతూ కన్నీళ్ల గాథలు ఉన్న పాలమూరు జిల్లా ప్రజల తరఫున తాము మాట్లాడుతున్నామన్నారు. పదేళ్లు పాటు కేసీఆర్ పాలించినా పాలమూరు జిల్లాకు ఒక్క చుక్క నీరు రాలేదన్నారు. వైఎస్సాఆర్ సీఎంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టుల కారణంగా నీళ్లు వస్తున్నాయన్నారు.
కాంగ్రెస్ హయాంలో 262 టీఎంసీల కృష్ణా జలాలను వాడుకుంటే బీఆర్ఎస్ హయాంలో కేవలం 212 టీఎంసీల నీటినే వాడుకున్నారన్నారు. కృష్ణా జలాల్లో మన రాష్ట్రానికి రావాల్సిన వాటా తెచ్చుకోలేని అసమర్థుడు కేసీఆర్ అని వంశీచంద్ రెడ్డి ఫైర్ అయ్యారు. పాలమూరు జిల్లాను కేసీఆర్ సస్యశ్యామలం చేశారని చెబుతున్నారని.. మరి దమ్ముంటే మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలని వంశీచంద్ రెడ్డి సంచలన సవాల్ విసిరారు. ఆ ఎన్నికలే రెఫరెండంగా తీసుకుందామన్నారు. చలో మేడిగడ్డకు పోటీగా కాంగ్రెస్ పార్టీ ‘చలో పాలమూరు-రంగారెడ్డి’ కార్యక్రమాన్ని చేపడతామని ఆయన ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి,నారాయణపేట ఎమ్మెల్యే ప్రాణిక రెడ్డి తదితరులు పాల్గొన్నారు.