| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

పాడిరైతుల సమస్యలపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలి : ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

పాడిరైతుల సమస్యలపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలి : ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు జి. చిన్నారెడ్డికి వినతి పత్రం అందచేసిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా బ్యూరో  : పాడి రైతుల సమస్యల సాధన కోసం ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతూ షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు జి చిన్నారెడ్డి కి వినతి పత్రం అందజేశారు. చిన్నారెడ్డి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులుగా ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో  ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పాల్గోన్నారు. ఈ సందర్భంగా పాడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను  తెలియజేస్తూ వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న విజయ డైరీని మూసి వేయించాలనే కుట్రతో  ప్రైవేటు రంగ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న డైరీ సంస్థలు ఏకమై ఇతర రాష్ట్రాల నుంచి పాలను దిగుమతి చేసుకొని రాష్ట్రంలోని పాడి రైతులకు నష్టాన్ని కలిగించే విధంగా తక్కువ ధరకు పాలను కొనుగోలు చేయడం జరుగుతుంది తద్వారా తెలంగాణ విజయ డైరీ ఎక్కువ ధర చెల్లించి పాలను సేకరించలేక పోతుందనీ, పాడి రైతుల సమస్యలను పరిష్కరించేందుకై వెంటనే తెలంగాణ ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసి  వాటిని పరిష్కరించే ప్రయత్నం చేయాలని కోరారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సంస్థలలో తెలంగాణ విజయ డైరీ పాల ఉత్పత్తులను మాత్రమే ఉపయోగించాలని తద్వారా తెలంగాణ విజయ డైరీని కాపాడుకోవడానికి అవకాశం ఉంటుందని, విజయ డైరీ గత కొంతకాలంగా పాడి రైతులకు చెల్లించినటువంటి డబ్బులను వెంటనే చెల్లించే విధంగా తగు చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా రైతులకు అందించే ఇన్సెంటివ్ బోనస్ 4 రూపాయలు  చెల్లించకుండా వాయిదా వేస్తున్నారు వాటిని వెంటనే రైతులకు అందే విధంగా ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాలని కోరారు.

Previous ఒక్క నిమిషం ఆలస్యం నిబంధనతో పరీక్ష రాయలేక పోయిన విద్యార్థి ఆత్మహత్య
Next గవర్నర్‌ తమిళిసైని కలిసిన ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు
ADVERTISEMENT