| Daily భారత్
Logo




చిన్న చిన్న అవసరాల కోసం లోన్అప్ లను ఆశ్రయించి సైబర్ నేరగాళ్ల చేతుల్లో మోసపోకండి : జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్

News

Posted on 2023-10-07 11:01:42

Share: Share


చిన్న చిన్న అవసరాల కోసం లోన్అప్ లను ఆశ్రయించి సైబర్ నేరగాళ్ల చేతుల్లో మోసపోకండి : జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్

మీకు లోన్ ఎలిజిబిలిటీ ఉందని వచ్చే మెసేజ్, కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండండి.

సైబర్ నేరాలకు గురైతే చేయవలసిన టోల్ ఫ్రీ నెంబర్లు 1930, డయల్ 100,లకు తక్షణమే కాల్ చేయండి

జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల జిల్లా : సైబర్ నేరగాళ్లు ఆశ, భయం అనే రెండు అంశాల మీద సైబర్  నేరస్తులు సైబర్ నేరాలు చేస్తున్నారు.అవసరాల కోసం లోన్ యాప్ లను ఆశ్రయించి మోసపోవద్దు అని అదేవిధంగా మీకు లోన్ ఎలిజిబిలిటీ ఉందని వచ్చే ఫోన్ కాల్స్, మెసేజ్ ల పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు.నకిలీ లాటరీలు,నకిలీ ఉద్యోగ ప్రకటనలు, నకిలీ బ్యాంకు అకౌంట్ సమాచారం మరియు నకిలీ గిఫ్టు బాక్సులు,లోన్ యాప్ ,పార్ట్ టైమ్ జాబ్, తక్కువ పెట్టుబడి తో ఎక్కువ లాభం, పింక్ వాట్సాప్ పేర్లతో సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేస్తున్నారని వీటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.మన వ్యక్తిగత సమాచారాన్ని ఎప్పుడు సామాజిక మాధ్యమాలలో పంచుకోకూడదు ఎందుకంటే సైబర్ నేరగాళ్లు ఇలాంటి అవకాశాల కోసం వేచి చూస్తారు కావున ఫోన్లు వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే 1930 కి కాల్ చేస్తే మీరు పోగొట్టుకున్న డబ్బులను తిరిగి పొందేలా చేయవచ్చు...


రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో ఈ వారం రోజుల వ్యవధిలో జరిగిన కొన్ని సైబర్ నేరాలు

ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితులకి గుర్తు తెలియని నెంబర్ నుంచి రిలయన్స్ ఫైనాన్స్ ఏజెంట్ అని కాల్ వచ్చింది. బాధితునికి లోన్ ఎలిజిబిలిటీ ఉందని సాంక్షన్ అవుతుందని నమ్మించి బాధితుని దగ్గర నుంచి పాన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్బుక్, ఫోటో తీసుకున్నారు తర్వాత రిజిస్ట్రేషన్ అమౌంట్ అని చెప్పి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు తద్వారా బాధితుడు 12,320/- నష్టపోయా. 

సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితునికి గుర్తు తెలియని నెంబర్ నుంచి ఇండియన్ బుల్స్ పర్సనల్ లోన్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పి కాల్ వచ్చింది ఒక లక్ష రూపాయల లోన్ కి బాధితుడు ఎలిజిబిలిటీ అని చెప్పి నమ్మించాడు.లోన్ రావాలంటే లోన్ అప్రూవల్ ఫీజ్ ప్రాసెసింగ్ ఫీస్ కట్టాలి అని చెప్పి 11100/- బాధితుల నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. 

సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితుడు డబ్బుల కోసం ఆన్లైన్ లోన్ ఆప్ లని ఆశ్రయించాడు. ఆన్లైన్లో లోన్ ఆప్ డౌన్లోడ్ చేయడం వల్ల బాధితుని యొక్క ఫోన్ నుండి గోపమైన సమాచారం సైబర్ నేరగాల చేతిలోకి వెళ్ళింది. తర్వాత సైబర్ నేరస్తులు బాధితునిఫోన్ కాంటాక్ట్స్ ని సేకరించి పార్కింగ్ చేసిన అశ్లీల చిత్రాలను ఆ కాంటాక్ట్స్ కి షేర్ చేసి అధిక మొత్తంలో డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలని డిమాండ్ చేస్తున్నాడు తద్వారా బాధితుడు 3,15,000/- మోసపోయాడు.గంభీరావుపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితునికి గుర్తు తెలియని నెంబర్ నుంచి రిలయన్స్ ఫైనాన్స్ ఏజెంట్ అని కాల్ వచ్చింది అని నమ్మించి ప్రాసెసింగ్ ఫీజు అప్రూవల్ ఫీజ్ జిఎస్టి అని చెప్పి పలు దఫాలుగా 13945/- అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. 

ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితుడు ఫేస్బుక్లో ఆడ్ చూసి క్రెడిట్ కార్డ్ అప్లై చేయడం కోసం లింకు క్లిక్ చేశాడు. తర్వాత అన్నోన్ నెంబర్ నుంచి క్రెడిట్ కార్డ్ ఏజెంట్ అని ఫోన్ వచ్చింది. బాధితుడు క్రెడిట్ కార్డు కోసం అని తన బ్యాంకు వివరాలు సైబర్ మోసగాడికి తెలియజేశాడు తద్వారా బాధితుడు 28,620/- మోసపోయాడు.తీసుకోవలసిన జాగ్రత్తలు మీకు లాటరి వచ్చిందని, కాల్ గాని మెసేజ్ గాని వచ్చిందా ?.. ఆశపడకండి, అనుమానించండి.

లాటరి పేరుతో సైబర్ మోసాలు, అప్రమత్తంగా ఉండండి. మీకు ఇలాంటి మెసేజెస్ వస్తే వెంటనే 1930 కి కాల్ చేసి ఫిర్యాదు చెయ్యండి. వేలల్లో పెట్టుబడి లక్షల్లో లాభాలు అంటూ వచ్చే వాట్సాప్, టెలిగ్రామ్ ప్రకటనలను నమ్మకండి.

తక్కువ డబ్బులు పెట్టినప్పుడు లాభాలు ఇచ్చి ఎక్కువ మొత్తంలో డబ్బులు పెట్టినప్పుడు డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తారు. ఇలాంటి సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 కి కాల్ చెయ్యండి.

మీకు ఉద్యోగం ఇస్తాం అంటూ మెసేజెస్ చేసి, మిమ్మల్ని డబ్బులు కట్టమంటున్నారు అంటే వాళ్ళు సైబర్ మోసగాళ్ళు అని గ్రహించండి.

మీ SBI YONO బ్లాక్ అయిందని PAN CARD అప్డేట్ చెయ్యమని వచ్చే మెసేజులు నమ్మకండి, ఇందులో ఉన్న లింక్స్ పై క్లిక్ చెయ్యకండి సోషల్ మీడియా లో ప్రకటనలు చూసి పెట్టుబడి పెట్టకండి, కొంచెం ఆగి ఆలోచించండి, అది సైబర్ మోసం కూడా కావచ్చు.మీ ప్రమేయం లేకుండా మీకు ఓటీపీ వస్తే దాన్ని ఎవరికీ చెప్పకండి. అది సైబర్ నేరగాళ్ల ఎత్తుగడ అయివుండవచ్చు.

Image 1

గలిగే లక్ష్మయ్య(చంటి) చిత్రపటానికి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ నాయకురాలు బానోతు మనిషా లక్ష్మీ మదన్లాల్

Posted On 2026-08-17 18:43:37

Readmore >
Image 1

బిఆర్ఎస్ పార్టీ నాయకుడు గెలిగే చంటి కుటుంబాన్ని పరామర్శించిన జూలూరుపాడు మండల బిఆర్ఎస్ నాయకులు

Posted On 2026-08-17 18:41:29

Readmore >
Image 1

కల్లూరు పట్టణంలో నిరుపేద వృద్ధులకు దుప్పట్ల పంపిణీ

Posted On 2026-08-17 18:31:18

Readmore >
Image 1

న్యూఢిల్లీలో ఎన్సీపీ పార్టీ జాతీయ కార్యాలయంలో మద్దిశెట్టి బృందం సమావేశం

Posted On 2026-08-17 18:28:24

Readmore >
Image 1

అన్న vs బావ... కత్తి దాడితో హాట్ టాపిక్ అయిన కోనరావుపేట

Posted On 2026-08-17 18:17:01

Readmore >
Image 1

అదృష్టం పేరుతో మోసం... టాస్క్‌ఫోర్స్ వలలో 6 మంది

Posted On 2026-08-17 16:03:05

Readmore >
Image 1

₹7 లక్షల క్రిప్టో మోసం... ఫేస్‌బుక్‌లో ఉచ్చు వేసి దోచుకున్న ముఠా గుట్టు రట్టు

Posted On 2026-08-17 15:32:36

Readmore >
Image 1

రిటైర్మెంట్‌ డబ్బులు, ఆస్తి కోసం భర్తను రోకలిబండతో కొట్టి చంపిన భార్య!

Posted On 2026-08-17 15:17:48

Readmore >
Image 1

అత్యవసర వేళలో ఆపన్నహస్తం... చిన్నారికి ప్లేట్లెట్స్ ఇచ్చిన బీజేపీ నేత సురేష్

Posted On 2026-08-17 15:01:32

Readmore >
Image 1

పెళ్లి వేడుకను సేవగా మార్చిన దాతలు... వేములవాడ బాలికల పాఠశాలకు 200 స్టీల్ గ్లాసుల విరాళం

Posted On 2026-08-17 14:52:49

Readmore >