| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కల్యాణ లక్ష్మి , షాది ముభారక్ చెక్కుల పంపిణీ చేసిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

కల్యాణ లక్ష్మి , షాది ముభారక్ చెక్కుల పంపిణీ చేసిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

మహిళా మణులకే కాంగ్రెస్ సర్కార్ పెద్దపీట

70 మందికి కల్యాణ లక్ష్మి చెక్కులు రూ. 70.8120 లక్షలు

28 మందికి షాది ముభారక్ రూ. 28.3248 లక్షల చెక్కుల పంపిణీ

కల్యాణ లక్ష్మి , షాది ముభారక్ చెక్కుల పంపిణీ చేసిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

కాంగ్రెస్ సర్కార్ మహిళా మణులకు పెద్దపీట వేస్తోంది : ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా బ్యూరో:  కాంగ్రెస్ సర్కార్ మహిళా మణులకు పెద్దపీట వేస్తోందని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ స్పష్టం చేశారు. గురువారం ఫరూఖ్ నగర్ మండల కార్యాలయ సమావేశ మందిరంలో మండలంలోని కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. 70 మందికి కల్యాణ లక్ష్మి చెక్కులు రూ. 70.8120 లక్షలు, 28 మందికి షాది ముభారక్ రూ. 28.3248 లక్షల చెక్కుల పంపిణీ చేయడం జరిగిందని ఎమ్మెల్యే శంకర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళాభ్యున్నతి కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు తీసుకువస్తుందని విడతల వారీగా వారికి అందజేస్తుందని తెలిపారు. 

తెలంగాణలో అధికారంలోకి వస్తే మహిళలకు మహాలక్షి పథకం కింద నెలకు రూ.2500, టీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, పేద మహిళలకు రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ అమలుచేస్తామని చెప్పి ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల ఆర్థిక సహకారం అందజేస్తున్నారని తెలిపారు. 

ఉగాది వరకు మరికొన్ని సంక్షేమ పథకాలు ప్రజల ముంగిటికీ వస్తాయని తెలిపారు త్వరలోనే పేదలకు గృహాలకు 200 విద్యుత్ యూనిట్లు ఉచితంగా ఇస్తామని చెప్పారు ప్రస్తుతం ఆ ప్రక్రియ రాష్ట్రంలో వేగవంతంగా కొనసాగుతుందని తెలిపారు.

చెక్కుల పంపిణీ సందర్భంగా స్థానిక తహసిల్దార్ పార్థసారధి ఎమ్మెల్యే శంకర్ కు శాలువాతో సన్మానించి పూల మొక్కను బహుకరించారు.


ఈ కార్యక్రమంలో జడ్పిటిసి వెంకటరామిరెడ్డి, ఎంపీడీవో బన్సీలాల్, మధురాపురం ఎంపీటీసీ భార్గవ్ కుమార్ రెడ్డి, ఎలికట్ట ఎంపీటీసీ శ్రీశైలం, కౌన్సిలర్లు శ్రీనివాస్ మరియు శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మొహమ్మద్ అలీ ఖాన్ బాబర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గండ్రతి బాలరాజ్ గౌడ్ మండల పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, కొందుర్గు కృష్ణారెడ్డి, సయ్యద్ ఖదీర్ తదితరులు ఉన్నారు..

Previous మహబూబ్‌నగర్‌ ఎంపి అభ్యర్దిగా చల్లా వంశీచంద్‌రెడ్డి
Next సంతు సేవాలాల్ జ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
ADVERTISEMENT